శక్తిగల షాలేమురాజా షారోను రోజా - YouWorship
Shakthigala Shaalemuraajaa Shaaronu Rojaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: శక్తిగల షాలేమురాజా షారోను రోజా - స్తుతియించెదము యేసు (2) 1. పూర్వమున పల్కిన నీ ప్రవచవోక్తులన్ని (1) చక్కగను మక్కువతో చేసితివి నీవు - చేసితివి నీవు (1) పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్ని (2) వరుసగను జరిపితివి నిన్ను పోలినవాడు వేరెవ్వరు లేరు (2) 2. బయలు పరచినట్టి నమూనాను పోలి నాడు బలముగను నీదు ప్రత్యక్ష గుడారమును - నీ గుడారమును కట్టితివి నీ దాసుడై నట్టి మోషే ద్వారా నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను 3. షాలేము యెసూషలేములోని ఆలయము సొలొమోను ద్వారా కట్టించిన మహారాజా - కట్టించిన రాజా ఆలయమును నిర్మించినట్టి మహారాజా నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను 4. కాలము సంపూర్ణముగ పరిణమించగానే కన్య గర్భమున ప్రభో జన్మించితి వీవు - జన్మించితి వీవు కట్టెదను నా సంఘము నని సెలవిచ్చి కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు - నీ ఆలయముగను 5. హస్తకృతాలయములో వసించని నీవు వింతగాను మా మధ్యను ఉండగోరినావు - ఉండగోరినావు కాంతివంతమైన నీదు మహా మహిమతోనే స్వంత వారినంత నింప తీర్మానించినావు - తీర్మానించినావు 6. అక్కడను ఇక్కడ నొక్కొక్కరిని యేరి అద్భుతముగను జత చేయువాడ వీవు - చేయువాడ వీవు నూతన దంపతులను వింతగా దీవించి అంతకంతకు వర్ధిల్ల జేయువాడ వీవే - కాయువాడ వీవే 7. వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి శక్తిగల సంఘ వధువుగ మార్చివేసి - నీవే మార్చివేసి వింతగా నా వధువునకు వరుండవై నావు ఆంతము లేదహా నీ మహిమ రాజ్యమునకు - హల్లెలూయా ఆమెన్ Pallavi: Shakthigala Shaalemuraajaa Shaaronu Rojaa - Sthuthiyinchedamu Yesu (2) 1. Poorvamuna Palkina Nee Pravachavokthulanni (1) Chakkaganu Makkuvatho Chesithivi Neevu - Chesithivi Neevu (1) Poorvamuna Choopina Nee Prathyakshathalanni (2) Varusaganu Jaripithivi Ninnu Polinavaadu Verevvaru Leru (2) 2. Bayalu Parachinatti Namoonaanu Poli Naadu Balamuganu Needu Prathyaksha Gudaaramunu - Nee Gudaaramunu Kattithivi Nee Daasudai Natti Moshe Dvaaraa Nimpithivi Nindaina Nee Prabhaava Mahimanu - Prabhaava Mahimanu 3. Shaalemu Yesooshalemuloni Aalayamu Solomonu Dvaaraa Kattinchina Mahaaraajaa - Kattinchina Raajaa Aalayamunu Nirminchinatti Mahaaraajaa Nimpithivi Nindaina Nee Prabhaava Mahimanu - Prabhaava Mahimanu 4. Kaalamu Sampoornamuga Parinaminchagaane Kanya Garbhamuna Prabho Janminchithi Veevu - Janminchithi Veevu Kattedanu Naa Sangghamu Nani Selavichchi Kattuchunnaavu Mammula Nee Svaroopamunaku - Nee Aalayamuganu 5. Hasthakruthaalayamulo Vasinchani Neevu Vinthagaanu Maa Madhyanu Undagorinaavu - Undagorinaavu Kaanthivanthamaina Needu Mahaa Mahimathone Svantha Vaarinantha Nimpa Theermaaninchinaavu - Theermaaninchinaavu 6. Akkadanu Ikkada Nokkokkarini Yeri Adbhuthamuganu Jatha Cheyuvaada Veevu - Cheyuvaada Veevu Noothana Dampathulanu Vinthagaa Deevinchi Anthakanthaku Vardhilla Jeyuvaada Veeve - Kaayuvaada Veeve 7. Vyakthulanu Kutumbamulanugaa Maarchivesi Shakthigala Sanggha Vadhuvuga Maarchivesi - Neeve Maarchivesi Vinthagaa Naa Vadhuvunaku Varundavai Naavu Aanthamu Ledahaa Nee Mahima Raajyamunaku - Hallelooyaa Aamen