వ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడు - YouWorship
Vyasanapadakumu Neevu Cheddavaaralanu Joochinayapudu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వ్యసనపడకుము - నీవు - చెడ్డవారలను జూచినయపుడు (1) మత్సరపడకుము - నీవు - దుష్కార్యములు చేయువారిని జూచి (1) 1. వారు గడ్డివలె త్వరగా (1)- ఎండిపోదురు (2) పచ్చని కూరవలె వారు - వాడిపోవుదురు - ఆ (2) ... నీవు 2. యెహోవా యందు నమ్మికయుంచి - మేలు చేయుము దేశమందు నివసించి సత్యము - ననుసరించుము - ఆ ... నీవు 3. నీవు యెహోవా ప్రభునిచే - సంతసించుము అయన నీదు హృదయములో - ని వాంఛలను తీర్చును - ఆ ..నీవు 4. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము ఆయనను నమ్ముకొనుము నీదు - కార్యము నెరవేర్చును - ఆ .. నీవు 5. నీ నీతి నిర్ధోషత్వంబును - వెల్లడి పరచును మౌనముగా నుండి అయన కొరకు - కనిపెట్టుకొనుము - ఆ ... నీవు 6. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము నీ కది - కీడు కే కారణము - ఆ ... నీవు 7. భక్తిహీనులు నీతిమంతులమీద - పండ్లు కొరుకుదురు వారికాలము వచ్చి యుండుట ప్రభుజూచి నవ్వుచున్నాడు - ఆ ... నీవు 8. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనము - కంటే శ్రేష్ఠము - ఆ ... నీవు 9. నీతిమంతులు ఆపత్కాలమందు - సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు - ఆ ... నీవు 10. ఒకని నడత యెహోవాయే - స్థిరము చేయును ఆయన వానిప్రవర్తనను జూచి - ఆనందించును - ఆ ... నీవు 11. యెహోవా అతని చేతిని - పట్టి యుండెను అతడు నేలను పడినను లేవ - లేక ఉండదు - ఆ...నీవు 12. నీతిమంతులు విడువబడుటగాని - వారి సంతానము భిక్షమెత్తుటగాని - నేను చూచి యుండ లేదు - ఆ ....నీవు Pallavi: Vyasanapadakumu - Neevu - Cheddavaaralanu Joochinayapudu (1) Mathsarapadakumu - Neevu - Dushkaaryamulu Cheyuvaarini Joochi (1) 1. Vaaru Gaddivale Thvaragaa (1)- Endipoduru (2) Pachchani Kooravale Vaaru - Vaadipovuduru - Aa (2) ... Neevu 2. Yehovaa Yandu Nammikayunchi - Melu Cheyumu Deshamandu Nivasinchi Sathyamu - Nanusarinchumu - Aa ... Neevu 3. Neevu Yehovaa Prabhuniche - Santhasinchumu Ayana Needu Hrudayamulo - Ni Vaanchhalanu Theerchunu - Aa ..Neevu 4. Needu Maargamu Yehovaaku Appagimpumu Aayananu Nammukonumu Needu - Kaaryamu Neraverchunu - Aa .. Neevu 5. Nee Neethi Nirdhoshathvambunu - Velladi Parachunu Maunamugaa Nundi Ayana Koraku - Kanipettukonumu - Aa ... Neevu 6. Kopamu Maanumu Aagrahamu Vidichipettumu Vyasanapadakumu Nee Kadi - Keedu Ke Kaaranamu - Aa ... Neevu 7. Bhakthiheenulu Neethimanthulameeda - Pandlu Korukuduru Vaarikaalamu Vachchi Yunduta Prabhujoochi Navvuchunnaadu - Aa ... Neevu 8. Neethimanthuniki Kaligina Konchemainanu Bahumandi Bhakthiheenulakunna Dhanamu - Kante Shreshthamu - Aa ... Neevu 9. Neethimanthulu Aapathkaalamandu - Siggunondaru Karuvu Dinamulalo Vaaru Thrupthi Ponduduru - Aa ... Neevu 10. Okani Nadatha Yehovaaye - Sthiramu Cheyunu Aayana Vaanipravarthananu Joochi - Aanandinchunu - Aa ... Neevu 11. Yehovaa Athani Chethini - Patti Yundenu Athadu Nelanu Padinanu Leva - Leka Undadu - Aa...Neevu 12. Neethimanthulu Viduvabadutagaani - Vaari Santhaanamu Bhikshameththutagaani - Nenu Choochi Yunda Ledu - Aa ....Neevu