వెలుగును రక్షణ కర్తయునగునా - YouWorship
Velugunu Rakshana Karthayunagunaa
Artist: రావి జాన్ సుందరరావు
Category: Praise & Worship
Song Lyrics
వెలుగును రక్షణ కర్తయునగునా - బలమగు దేవుని స్తోత్రింతును = వెరువను నేనిక నెవ్వరికిన్ - వెలుగైన యేసే నా దుర్గము 1. అగాధ చీకటి జలముల నుండి - అఖండమైన వెలుగు సృజించిన = యుగయుగంబుల నేలెడి (ప్రభువు - యఘముల బాపి నను వెలిగించును॥వెలు॥ 2. నా దీపమును వెలిగించు ప్రభువే - నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును = నా దోషము లెల్లను దన కాంతిలో - నాదరముగ కడిగి రక్షించును ॥వెలు॥ 3. పలువిధ శోధనల్ నను జుట్టినను - విలువగు సంపద లంతరించినను = వెలుగుదూత నాపై యురులొడ్డిన - నలయక నిత్యము నడచెద వెల్లులో ॥వెలు॥ 4. తల్లిదం[డ్రులు విడచినగాని - యుల్లము భీతిలి భయమందినను = ఎల్ల ప్రజలు నను ద్వేషించినను - ఎడబాయడునా - ప్రియుడగు యేసు ॥వెలు॥ ర్. క్రీస్తు యేసుడే లోకపు వెలుగని - వాస్తముగ గనుడి ప్రియులార = శాశ్వతంబగు రాజ్యము చేర - సత్వరమాయన వెలుగును బొందరె ॥వెలు॥ Velugunu Rakshana Karthayunagunaa - Balamagu Devuni Sthothrinthunu = Veruvanu Nenika Nevvarikin - Velugaina Yese Naa Durgamu 1. Agaadha Cheekati Jalamula Nundi - Akhandamaina Velugu Srujinchina = Yugayugambula Neledi (Prabhuvu - Yaghamula Baapi Nanu Veliginchunu॥Velu॥ 2. Naa Deepamunu Veliginchu Prabhuve - Naa Dari Cheekatin Veluguga Maarchunu = Naa Doshamu Lellanu Dana Kaanthilo - Naadaramuga Kadigi Rakshinchunu ॥Velu॥ 3. Paluvidha Shodhanal Nanu Juttinanu - Viluvagu Sampada Lantharinchinanu = Velugudootha Naapai Yuruloddina - Nalayaka Nithyamu Nadacheda Vellulo ॥Velu॥ 4. Thallidan[Drulu Vidachinagaani - Yullamu Bheethili Bhayamandinanu = Ella Prajalu Nanu Dveshinchinanu - Edabaayadunaa - Priyudagu Yesu ॥Velu॥ R. Kreesthu Yesude Lokapu Velugani - Vaasthamuga Ganudi Priyulaara = Shaashvathambagu Raajyamu Chera - Sathvaramaayana Velugunu Bondare ॥Velu॥