విసుగకుండా నిత్యము ప్రార్థించ వలెనని - YouWorship
Visugakundaa Nithyamu Praarthincha Valenani
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: విసుగకుండా నిత్యము - ప్రార్థించ వలెనని - విశదముగా నుడివితివి - విసుగకుండా నిత్యము (1) 1. ఏకీభవించి భువిపైన యిద్దరు (2)- వేడుకొను సంగతులను గూర్చి (2) నా తండ్రివలన దొరుకునని (2)- నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా (2) 2. ఆది అపొస్తలుల యేక భావముగా - ఎడతెగక నిను ప్రార్థించగా వారి మొఱ నాలించిన ప్రభువా - మా మొఱ నీ చెంతకు రానిమ్ము 3. పేతురపొస్తలుడు చెరసాలలో నుండ - అత్యాసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి - నీ గొప్ప మహాత్మ్యమును 4. నా యందు మీరు మీలో నావాక్యము - నిలిచియుండిన యెడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి - పొందుమంటివి క్రీస్తు ప్రభువా 5. ఇద్దరు ముగ్గురు నా నామమున యెక్కడ - విసుగక కూడియుందురో అందరి మధ్యనుండే ప్రభువా - రమ్ము మా మధ్యకు నేడే Pallavi: Visugakundaa Nithyamu - Praarthincha Valenani - Vishadamugaa Nudivithivi - Visugakundaa Nithyamu (1) 1. Ekeebhavinchi Bhuvipaina Yiddaru (2)- Vedukonu Sanggathulanu Goorchi (2) Naa Thandrivalana Dorukunani (2)- Nokki Cheppina Goppa Prabhuvaa (2) 2. Aadi Aposthalula Yeka Bhaavamugaa - Edathegaka Ninu Praarthinchagaa Vaari Mora Naalinchina Prabhuvaa - Maa Mora Nee Chenthaku Raanimmu 3. Pethuraposthaludu Cherasaalalo Nunda - Athyaasakthigaa Praarthinchagaa Aanaati Shishyulu Kaniri - Nee Goppa Mahaathmyamunu 4. Naa Yandu Meeru Meelo Naavaakyamu - Nilichiyundina Yedala Meeku Edi Ishtamo Daani Nadigi - Pondumantivi Kreesthu Prabhuvaa 5. Iddaru Mugguru Naa Naamamuna Yekkada - Visugaka Koodiyunduro Andari Madhyanunde Prabhuvaa - Rammu Maa Madhyaku Nede