విశ్వాస ఫలితములు - YouWorship
Vishvaasa Phalithamulu
Artist: మురారి దావీదు
Category: Praise & Worship
Song Lyrics
విశ్వాస ఫలితములు - విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా = విశ్వాస వంతునికి - విశ్వమ్ములోపల మ - వశ్యమ్మొదవు కస్తవా ॥విశ్వా॥ 1. ఫలములన్నిటి లోన - ప్రాముఖ్యమైనట్టి - ఫలమది పాప క్షమమే = విలువైన యీ ఫలము - గలుగు నరునికి ముక్తి - దొలగ దతనికి క్షేమమే ॥విశ్వా॥ 2. దానములలోను ప్ర- ధానమనబడు సమా - ధానమును గల్లించును= మాని తమ్ముగ సమా - ధానమును భువిదివుల - మహితుతో గల్లించును ॥విశ్వా॥ 3. నరక పాత్రులమైన - నావంటి నీవంటి - దురిత జీవుల కెల్లను = గొబితలన్నియు దీర్చ = నిరత జీవము నియ్య - నిశ్చయమ్మిది చెల్లును ॥ విశ్వా! 4. ముత్తెమ్మునకు వలెనె - మురికి గప్పంగబడిన - చిత్తమును చిత్రవిధిగా = రత్నమువలె మిగుల - రంజిల్లం జేసెడి ప-విత్రాత్మ మనకొదవుగా ॥విశ్వా॥ ర్. _మేరలేని దోష - కారులమై ప్రభుకు - దూరముగం దొలగియున్న = వారమగు నను నిన్ను - చేరంగ బిలిచి కు - మారత్వమొసంగు నన్న ॥విశ్వా॥ 6. సేగు క్రియలను జేసి - పోగొట్టుకొన్నట్టి - క్షేమ రాజ్యపు హక్కులన్ = బాగుగ మనకిచ్చి - బాంధవ్య మొనరించు - భగవంతునికి మనకున్ ॥విశ్వా॥। 7. విశ్వనాధుని గొప్ప - విశ్రాంతిలోను ప్ర- వేశము నాకు నొసంగుగా = విశ్వాస ఫలము లివి - నీ శాశ్వత రక్ష - ణాశ్రయం బిదియె విడకు ॥విశ్వా॥ Vishvaasa Phalithamulu - Vishadammugaa Neeku Vivarinthu Vinu Kraisthavaa = Vishvaasa Vanthuniki - Vishvammulopala Ma - Vashyammodavu Kasthavaa ॥Vishvaa॥ 1. Phalamulanniti Lona - Praamukhyamainatti - Phalamadi Paapa Kshamame = Viluvaina Yee Phalamu - Galugu Naruniki Mukthi - Dolaga Dathaniki Kshemame ॥Vishvaa॥ 2. Daanamulalonu Pra- Dhaanamanabadu Samaa - Dhaanamunu Gallinchunu= Maani Thammuga Samaa - Dhaanamunu Bhuvidivula - Mahithutho Gallinchunu ॥Vishvaa॥ 3. Naraka Paathrulamaina - Naavanti Neevanti - Duritha Jeevula Kellanu = Gobithalanniyu Deercha = Niratha Jeevamu Niyya - Nishchayammidi Chellunu ॥ Vishvaa! 4. Muththemmunaku Valene - Muriki Gappanggabadina - Chiththamunu Chithravidhigaa = Rathnamuvale Migula - Ranjillan Jesedi Pa-Vithraathma Manakodavugaa ॥Vishvaa॥ R. _Meraleni Dosha - Kaarulamai Prabhuku - Dooramugan Dolagiyunna = Vaaramagu Nanu Ninnu - Cherangga Bilichi Ku - Maarathvamosanggu Nanna ॥Vishvaa॥ 6. Segu Kriyalanu Jesi - Pogottukonnatti - Kshema Raajyapu Hakkulan = Baaguga Manakichchi - Baandhavya Monarinchu - Bhagavanthuniki Manakun ॥Vishvaa॥। 7. Vishvanaadhuni Goppa - Vishraanthilonu Pra- Veshamu Naaku Nosanggugaa = Vishvaasa Phalamu Livi - Nee Shaashvatha Raksha - Naashrayan Bidiye Vidaku ॥Vishvaa॥