విశ్వాసమే విజయము - YouWorship
Vishvaasame Vijayamu
Artist: మురారి దావీదు
Category: Praise & Worship
Song Lyrics
విశ్వాసమే విజయము - విను ప్రియుడా య - విశ్వాస మపజయము = విశ్వాసాయుతమైన - విసుకని సుకార్యములే - విశ్వాసవంతునికి - విజయ మొసంగును నిజము ॥విశ్వాసమే॥ 1. భక్తు డందు వలననే - (బ్రతుకును మరియు - శక్తినొంది నిల్చును = యుక్తముగ వర్తించి - యుర్విని జయించి - ముక్తినొందున టంచు - రక్తిగాం బాడుదును ॥విశ్వాసమే॥ 2. మంచి పేరు నొందును - సాతాను నెది- రించి విజయ మొందును = మించిన బాధ ల్ల - హించి జయించును - నంచిత మరణము - నానంద ముగంగాంచు ॥విశ్వాసమే॥ 3. (ప్రవిమల మొందెదము - పాపమునుండి - పరిహరింపంబడుదుము = అవి రతమును మనము - నాశ్చర్యముగ ఘనము - భువియందున్ దివియందున్ - బుధులతో నొందుదుము ॥విశ్వాసమే॥ 4. నీతిమంతుల మౌదుము - నిశ్చయము ప్ర- ఖ్యాతి బోధను నేర్తుము = ఆ తండ్రి దత్తముల - నన్ని యార్జించుచు - యాతని సుభద్రములో - ననయ ముందుము నిజము ॥విశ్వాసమే॥ 5. పరిపూర్ణ విశ్వాసమే - క్రియలతో నున్న - మరి మంచి విశ్వాసమే = ధరయందున్ బరమందున్ - ధన్యాత్మునిగం జేయున్ - సరగు నద్దానినే - సంపాదించుము ప్రియుడా ॥విశ్వాసమే॥ Vishvaasame Vijayamu - Vinu Priyudaa Ya - Vishvaasa Mapajayamu = Vishvaasaayuthamaina - Visukani Sukaaryamule - Vishvaasavanthuniki - Vijaya Mosanggunu Nijamu ॥Vishvaasame॥ 1. Bhakthu Dandu Valanane - (Brathukunu Mariyu - Shakthinondi Nilchunu = Yukthamuga Varthinchi - Yurvini Jayinchi - Mukthinonduna Tanchu - Rakthigaan Baadudunu ॥Vishvaasame॥ 2. Manchi Peru Nondunu - Saathaanu Nedi- Rinchi Vijaya Mondunu = Minchina Baadha Lla - Hinchi Jayinchunu - Nanchitha Maranamu - Naananda Muganggaanchu ॥Vishvaasame॥ 3. (Pravimala Mondedamu - Paapamunundi - Pariharimpambadudumu = Avi Rathamunu Manamu - Naashcharyamuga Ghanamu - Bhuviyandun Diviyandun - Budhulatho Nondudumu ॥Vishvaasame॥ 4. Neethimanthula Maudumu - Nishchayamu Pra- Khyaathi Bodhanu Nerthumu = Aa Thandri Daththamula - Nanni Yaarjinchuchu - Yaathani Subhadramulo - Nanaya Mundumu Nijamu ॥Vishvaasame॥ 5. Paripoorna Vishvaasame - Kriyalatho Nunna - Mari Manchi Vishvaasame = Dharayandun Baramandun - Dhanyaathmunigan Jeyun - Saragu Naddaanine - Sampaadinchumu Priyudaa ॥Vishvaasame॥