విలువేలేని నా జీవితం - YouWorship
Viluve Leni Naa Jeevitham
Artist: వినోద్ కుమార్
Category: Praise
Song Lyrics
విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారబోసితివే (2) నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే రోగమే నన్ను చుట్టుకొనియుండగా రోదనతో ఒంటరినైయుండగా నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే స్నేహితులే నన్ను వదిలేసినా బంధువులే భారమని తలచినా నా కొరకే బలి అయితివే (2) ||నీది|| సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము (2) ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని|| Viluveleni Naa Jeevitham – Nee Chethilo Padagaane Adi Entho Viluvani Naaku Choopithive Jeevame Leni Naalo Nee – Jeevamunu Nimputaku Nee Jeevithanne Dhaarabosithive (2) Needi Shaashwatha Premayaa – Nenu Marachipolenayaa Enni Yugaalaina Maaradhu Endina Prathi Modunu – Maralaa Chigurinchunu Naa Devuniki Samasthamu Saadhyame (2) Papamulo Padina Nannu Shapamulo Munigina Nannu Nee Prematho Lepithive Rogame Nannu Chuttukoniyundaga Rodhanatho Ontarinaiyundaga Na Kanneetini Thudichithive (2) ||Needi|| Pagalanthaa Megha Sthambhamai Raathranthaa Agni Sthambhamai Dinamanthayu Rekkalatho Kappithive Snehithule Nannu Vadilesinaa Bandhuvule Bhaaramani Thalachinaa Naa Korake Bali Aithive (2) ||Needi|| Saadhyame Saadhyame Saadhyame Naa Yesuku Samasthamu Saadhyame Saadhyame Saadhyame Naa Priyuniki Samasthamu (2) Endina Prathi Modunu Maralaa Chigurinchunu Naa Devuniki Samasthamu Saadhyame (2) ||Viluveleni||