విమల హృదయ మిమ్ము - YouWorship
Vimala Hrudaya Mimmu
Artist: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్
Category: Praise & Worship
Song Lyrics
విమల హృదయ మిమ్ము - విదితంబు నినుం గొల్వ - యేసునాధా = నీదు విమల రక్తము చేత - విశదమౌ యెద నిమ్ము - విశ్వనాధా || విమల|| 1. క్షమశాంత - మధికముగ నాకిమ్ము - ఆత్మనాధా = నీకుం బ్రణుతమౌ నా యెద - ప్రభునిపీఠము జేయు - మాత్మనాధా ||విమల|| 2. నీ చిత్తమే యంచు - నీ పాదములం బట్టి - నిల్చియుందు = నిండు - నికరమౌ ప్రకటమౌ - సుకరహృదయ మిమ్ము - మేసునాధా ||విమల|| 3. భయభక్తు లలరెడు - భావంబు నా కిమ్ము జీవనాధా = నన్ను - లయ జీవములయందు - జయశాలినిగం జేయు - మేసునాధా ||విమల|| 4. పరిశుద్ధ హృదయంబు - పరమేశ నా కిమ్ము - ధరణిమింద = నన్ని - తరుణములను నాకా - దరణ మావే యంచుం - దలంప నాధా ||విమల|| 5. నీ రూపము నిమ్ము - నినుం - బోలి నేనుండ - నిత్యనాధా = నీదు - సారూప్య మెదమిద - సంపూర్తిగా వ్రాయు - సత్యనాధా ||విమల|| 6. (ప్రేమపూరిత హృదయ - మేమరక నా కిమ్ము - పప్రేమనాధా = యెంతో సుమమౌ - నేమమౌ బ్రతుకిమ్ము - క్షేమనాధా Vimala Hrudaya Mimmu - Vidithambu Ninun Golva - Yesunaadhaa = Needu Vimala Rakthamu Chetha - Vishadamau Yeda Nimmu - Vishvanaadhaa || Vimala|| 1. Kshamashaantha - Madhikamuga Naakimmu - Aathmanaadhaa = Neekun Branuthamau Naa Yeda - Prabhunipeethamu Jeyu - Maathmanaadhaa ||Vimala|| 2. Nee Chiththame Yanchu - Nee Paadamulan Batti - Nilchiyundu = Nindu - Nikaramau Prakatamau - Sukarahrudaya Mimmu - Mesunaadhaa ||Vimala|| 3. Bhayabhakthu Lalaredu - Bhaavambu Naa Kimmu Jeevanaadhaa = Nannu - Laya Jeevamulayandu - Jayashaalinigan Jeyu - Mesunaadhaa ||Vimala|| 4. Parishuddha Hrudayambu - Paramesha Naa Kimmu - Dharaniminda = Nanni - Tharunamulanu Naakaa - Darana Maave Yanchun - Dalampa Naadhaa ||Vimala|| 5. Nee Roopamu Nimmu - Ninun - Boli Nenunda - Nithyanaadhaa = Needu - Saaroopya Medamida - Sampoorthigaa Vraayu - Sathyanaadhaa ||Vimala|| 6. (Premapooritha Hrudaya - Memaraka Naa Kimmu - Papremanaadhaa = Yentho Sumamau - Nemamau Brathukimmu - Kshemanaadhaa