వినవే నా వినతి - YouWorship
Vinave Naa Vinathi
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
వినవే నా వినతి నివేదన దయ వెలయుంచ నో ప్రభువా నిను శరణ జొందితి నను గుశలంబున నుంచువె యో ప్రభువా ||వినవే|| 1. నిర్మల గతి సంధ్యా కాలంబున - నీ స్తవ మగు ప్రభువా ధర్మదీప్తి నా కొసంగి చేయు - దీప్తవంతునిగ నన్ను ||వినవే|| 2. నీ మహదాశ్రయ మొసంగి దుర్గతిని - నేంబడకుండంగను నా మది త్రాణాది సమస్తముతో - ననున గావవె ప్రభువా ||వినవే|| 3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ - కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై - యున్నది రేవగలు ||వినవే|| 4. పాప కరుండను నే సుకృతా - పాది కర్మ మెజుంగ నీ పాద సరోజము నా కొసంగుము - నాపై నీ కృపం జెలంగ ||వినవే|| 5. నీ కొరకై నా మనము దృఢంబౌం - గాక యేసు ప్రభువా నాకుం బిశాచముచే భ్రమ జన్మము - గాకుండంగ నేలు ||వినవే|| Vinave Naa Vinathi Nivedana Daya Velayumcha No Prabhuvaa Ninu Sharana Jomdithi Nanu Gushalambuna Numchuve Yo Prabhuvaa ||Vinave|| 1. Nirmala Gathi Samdhyaa Kaalambuna - Nee Sthava Magu Prabhuvaa Dharmadeepthi Naa Kosamgi Cheyu - Deepthavamthuniga Nannu ||Vinave|| 2. Nee Mahadaashraya Mosamgi Durgathini - Nembadakumdamganu Naa Madi Thraanaadi Samasthamutho - Nanuna Gaavave Prabhuvaa ||Vinave|| 3. Enni Dinambulu Jagathi Nunna Nee - Kanna Vere Galavaa Pannuga Madi Nee Pada Samgathamai - Yunnadi Revagalu ||Vinave|| 4. Paapa Karumdanu Ne Sukruthaa - Paadi Karma Mejumga Nee Paada Sarojamu Naa Kosamgumu - Naapai Nee Krupam Jelamga ||Vinave|| 5. Nee Korakai Naa Manamu Drudhambaum - Gaaka Yesu Prabhuvaa Naakum Bishaachamuche Bhrama Janmamu - Gaakumdamga Nelu ||Vinave||