వినరే యో నరులారా - YouWorship
Vinare Yo Narulaaraa
Artist: పురుషోత్తము చౌధరి
Category: Christmas
Song Lyrics
వినరే యో నరులారా – వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే అనుదినమును దే-వుని తనయుని పద వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే|| నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే|| ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను దీన దయా పరు-డైన మహాత్ముడు జానుగ యాగము – సలిపిన తెరంగిది ||వినరే|| ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు-ములనలరెడు ధని కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే|| దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె బిరబిర మన మం-దర మా కరుణా శరనిధి చరణ మె – శరణని పోదము ||వినరే|| Vinare Yo Narulaaraa – Veenula Kimpu Meera Manala Rakshimpa Kreesthu – Manujaavathaarudayye – Vinare Anudinamunu De-vuni Thanayuni Pada Vanajambulu Mana-muna Nidikonuchunu ||Vinare|| Nara Roopu Booni Ghora – Narakula Raarammani Dhurithamu Baapu Dhodda – Dorayav Mariyaa Varaputhrudu Kara Maru Dhagu Ka-lvari Giri Dhari Kari Gi Rayambuna Prabhu – Karunanu Ganare ||Vinare|| Aanandamaina Moksha-mandhari Kiyya Deeksha Booni Thana Meni Siluva – Mraanu Nanachi Mruthi Bondenu Deena Dayaa Paru-daina Mahaathmudu Jaanuga Yaagamu – Salipina Therangidi ||Vinare|| Ila Maayaavaadula Maani – Yithade Sadguru-dani Thalaposi Choochi Mathi Ni-schala Bhakthini Golichina Vaariki Nila Janulaku Galu-mulanalaredu Dhani Kula Kandani Sukha-mulu Mari Yosagunu ||Vinare|| Durithamu Lanapa Vachchi – Maranamai Thirigi Lechi Niratha Mokshaananda Sun-dara Mandiramuna Karudhuga Jane Birabira Mana Man-dara Maa Karunaa Sharanidhi Charana me – Sharanani Podamu ||Vinare||