వినరే నరులారా - YouWorship
Vinare Narulaaraa
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
వినరే నరులారా - మనముల - వేడుకలను మోర = మన, రక్షకుండగు - మరియా తనయుని - మహిమలు చెవులార ||1వినరే|| 1. తన కన్నను ముందు - యోహా - నను నతం డింపొందు = ఘనతర మగును - ప్రవచనముంబ - ల్మెను భూజను లందు- ||వినరే|| 2. అతండు యోర్పాను - నదిలో - ఖ్యాతిగ ననుదినమున్ = పాతకులకు బా - ప్తిస్మ మిచ్చు నెడం - ప్రభు వచ్చటి కరిగెన్ ||1వినరే|| 3. న్యాయము నిలుపుటకై - ప్రభుని వి- ధేయతం గనుపజిచి = శ్రేయ పతి బొం - దెను యోహానుని - చేత బాప్తిస్మంబు ||1వినరే|| 4. _ పరమండల మపుడు - తెరవం - బడి పావురము గతిన్ = పరిశుద్ధాత్మ శు - భప్రభ లీనుచుం - ప్రభువు మింద వ్రాలెన్ ||వినరే|| 5. ఆకాశమునుండి - కలిగెను - ప్రాకటమగు రవము = నా కితండు ప్రియం - బౌ కుమారుండా - నంద మొంది రనుచు ||వినరే|| 6. అంతట మన కర్త - పరిశుద్దాత్మ బలము కలిమిన్ = సంతసమున మో - క్ష కుశలవార్తను - జాటంగను దొడంగెన్ ||వినరే|| 7. ఆ నిత్య సువార్త - మన మెద - లో నిడి నమ్మినచో = నానందమయం బమృత మేసు ద-యా నిధి మన కొసంగున్ వినరే|| Vinare Narulaaraa - Manamula - Vedukalanu Mora = Mana, Rakshakundagu - Mariyaa Thanayuni - Mahimalu Chevulaara ||1Vinare|| 1. Thana Kannanu Mundu - Yohaa - Nanu Nathan Dimpondu = Ghanathara Magunu - Pravachanamumba - Lmenu Bhoojanu Landu- ||Vinare|| 2. Athandu Yorpaanu - Nadilo - Khyaathiga Nanudinamun = Paathakulaku Baa - Pthisma Michchu Nedan - Prabhu Vachchati Karigen ||1Vinare|| 3. Nyaayamu Niluputakai - Prabhuni Vi- Dheyathan Ganupajichi = Shreya Pathi Bon - Denu Yohaanuni - Chetha Baapthismambu ||1Vinare|| 4. _ Paramandala Mapudu - Theravan - Badi Paavuramu Gathin = Parishuddhaathma Shu - Bhaprabha Leenuchun - Prabhuvu Minda Vraalen ||Vinare|| 5. Aakaashamunundi - Kaligenu - Praakatamagu Ravamu = Naa Kithandu Priyan - Bau Kumaarundaa - Nanda Mondi Ranuchu ||Vinare|| 6. Anthata Mana Kartha - Parishuddaathma Balamu Kalimin = Santhasamuna Mo - Ksha Kushalavaarthanu - Jaatangganu Dodanggen ||Vinare|| 7. Aa Nithya Suvaartha - Mana Meda - Lo Nidi Namminacho = Naanandamayan Bamrutha Mesu Da-Yaa Nidhi Mana Kosanggun Vinare||