వినరండి నా ప్రియుని విశేషము - YouWorship
Vinarandi Naa Priyuni Visheshamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని (2) ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసె చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2) స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపన్ జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చెంతన చేరెదను స్తుతినే వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చెంతన చేరెదను యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి|| తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2) ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే ఫలము ప్రతిఫలము నే పొందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి|| Vinarandi Naa Priyuni Visheshamu… Vinarandi Naa Priyuni Visheshamu Naa Priyudu (Varudu) Sundarudu Mahaa Ghanudu (2) Naa Priyuni Needalo Cherithini Premaku Roopamu Choosithini (2) Aaha Entho Mansanthaa Ika Aanandame Thanuvanthaa Pulakinche Mahadaanandame ||Vinarandi|| Mahimatho Nindina Veedhulalo Booralu Mroge Aakaasha Pandirilo (2) Jathagaa Cheredanu Aa Sannidhilo Kurise Chirujallai Premaamruthamu Naa Priya Yesu nanu Choosi Dari Cherune Jathagaa Cheredanu Aa Sannidhilo Naa Premanu Priyuniki Thelipedanu Kanneeru Thudichedi Naa Prabhuve ||Vinarandi|| Jagathiki Roopamu Lenappudu Korenu Nannu Thana Koraku Naa Prabhuvu (2) Sthuthine Vasthramugaa Dharinchukoni Krupane Jayadhwanitho Keerthinchedanu Naa Prabhu Yesu Chenthana Cheredanu Sthuthine Vasthramugaa Dharinchukoni Naa Prabhu Yesu Chenthana Cheredanu Yugamoka Kshanamuga Jeevinthunu ||Vinarandi|| Thalapula Prathi Malupu Gelupulatho Niliche Shuddha Hrudayaala Veerulatho (2) Phalamu Prathiphalamu Ne Pondukoni Priya Yesu Raajyamulo Ne Nilichedanu Aa Shubhavela Naakentho Aanandame Phalamu Prathiphalamu Ne Pondukoni Aa Shubhavela Naakentho Aanandame Naa Priyuni Viduvanu Nenennadu ||Vinarandi||