వినతి వినతి వినతి త్రియేకునికి - YouWorship
Vinathi Vinathi Vinathi Thriyekuniki
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వినతి వినతి వినతి త్రియేకునికి (2) అను పల్లవి: మనసునందు సద్గతి నిడును (2) 1. కోపదినమును తప్పించుకొనుటకు - ఏ పని చేసితివి (2) బాధలు నిన్ను చేరక యుండును - నాథుని కనుగొనిన (2) 2. ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి - నెచ్చెలు డేసును నమ్ము మేదినిసకలము మాయమైపోవును - సదయుడేను నిలచున్ 3. కాయమస్థిరము కాలము నిల్వదు - మాయక్షితి మాయమగున్ దాసుడాకాలము వ్యర్థము చేయక - యేసునంగీకరింపుము 4. రక్షకుడేసును సిలువలో గనుము - రక్షింప బడియెదవు జీవము సత్యము మార్గము చూతువు - దైవసుతునియందు 5. రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు - రక్షణ శృంగము కోట మింటను దేవుడు బండయు కేడెము - జుంటితేనెయు నాయనే 6. మంచికాపరి నిరతము కాచు - నంచితముగ నడుపున్ జయము నిచ్చున్ త్రోసివేయక - ప్రియముతో పరుగిడరా 7. హల్లెలూయ పాట నార్భాటముతో - నెల్లరకు చాటుము త్వరగా రాజువచ్చును భువికి - దుష్టుల నణచుటకై Pallavi: Vinathi Vinathi Vinathi Thriyekuniki (2) Anu Pallavi: Manasunandu Sadgathi Nidunu (2) 1. Kopadinamunu Thappinchukonutaku - E Pani Chesithivi (2) Baadhalu Ninnu Cheraka Yundunu - Naathuni Kanugonina (2) 2. Ichchhala Nellanu Ilalo Vidachi - Nechchelu Desunu Nammu Medinisakalamu Maayamaipovunu - Sadayudenu Nilachun 3. Kaayamasthiramu Kaalamu Nilvadu - Maayakshithi Maayamagun Daasudaakaalamu Vyarthamu Cheyaka - Yesunanggeekarimpumu 4. Rakshakudesunu Siluvalo Ganumu - Rakshimpa Badiyedavu Jeevamu Sathyamu Maargamu Choothuvu - Daivasuthuniyandu 5. Rakshaku Daashrayadurgamu Vaidyudu - Rakshana Shrunggamu Kota Mintanu Devudu Bandayu Kedemu - Juntitheneyu Naayane 6. Manchikaapari Nirathamu Kaachu - Nanchithamuga Nadupun Jayamu Nichchun Throsiveyaka - Priyamutho Parugidaraa 7. Hallelooya Paata Naarbhaatamutho - Nellaraku Chaatumu Thvaragaa Raajuvachchunu Bhuviki - Dushtula Nanachutakai