విధేయతకే అర్ధము చెప్పిన - YouWorship
Vidheyathake Ardhamu Cheppina
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2) సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2) అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2) శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2) రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత|| Vidheyathake Ardhamu Cheppina Vinaya Manaskudaa Vidheyulugaa Unda Maadiri Choopina Manuja Komarudaa Avidheyatha Tholaginchumayyaa Nee Deena Manassu Kaliginchumayyaa (2) ||Vidheyathake|| Paricharya Cheyutake Dharaniki Vachchina Thyaagamoorthivi Prathi Charya Jariginchaka Pagavaarini Kshamiyinchina Prema Deepthivi (2) Siluva Maranamu Pondunanthagaa Neeve Thagginchukontivi (2) Adhikamugaa Hechchimpabadithivi (2) ||Avidheyatha|| Paripoornamaina Bhaya Bhakthulatho Thandriki Lobadithivi Prathi Vishayamulo Pampina Vaani Chitthamu Neraverchithivi (2) Shramalu Pondi Yaajakudani Devuniche Piluvabadithivi (2) Rakshanaku Kaarakudavaithivi (2) ||Avidheyatha||