విడువను నిను ఎడబాయనని - YouWorship
Viduvanu Ninu Edabaayanani
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
విడువను నిను ఎడబాయనని నా కభయ మొసంగిన దేవా నా కభయ మొసంగిన దేవా నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2) నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను|| పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2) నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను|| మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2) గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను|| సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2) నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను ||విడువను|| Viduvanu Ninu Edabaayanani Naa Kabhaya Mosangina Devaa Naa Kabhaya Mosangina Devaa Neramulenno Chesi Chesi – Daari Thappi Thirigithinayyaa (2) Neramu Baapumu Devaa – Nee Daarini Nadupumu Devaa ||Viduvanu|| Pandulu Mepuchu Aakali Baadhalo – Pottunu Korina Neechudanayyaa (2) Nee Dari Cherithinayyaa Naa Thandrivi Neeve Gadayyaa ||Viduvanu|| Mahima Vasthramu Samaadhaanapu Jodunu Naaku Thodigithivayyaa (2) Goppagu Vindulo Cherchi Nee Komarunigaa Chesithivi ||Viduvanu|| Sundaramaina Vindulalo Parishuddhulatho Kalipithivayyaa (2) Nindugaa Naa Hrudayamutho Deva Vandanamarpinchedanu ||Viduvanu||