విజయ గీతముల్ పాడరే - YouWorship
Vijaya Geethamul Paadare
Artist: అల్లారి పెదవీరాస్వామి
Category: Praise
Song Lyrics
విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2) వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| మంగళముగ యేసుడే మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను రంగు మీరగదన – రక్త బలము వలన పొంగు నణగ జేసెను సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ|| పాపముల్ దొలగింపను మనలను దన స్వ – రూపంబునకు మార్పను శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ – కోపమున్ భరియించెను పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు పాప యాగము దీర్చెను దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ|| సిలువ మరణము నొందియు మనలను దనకై – గెలువన్ లేచిన వానికి చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ|| Vijaya Geethamul Paadare Kreesthuku Jaya – Vijaya Geethamul Paadare (2) Vrujina Manthati Meeda – Vijaya Michchedu Deva Nija Kumaaruni Naamamun Hrudayamulatho – Bhajana Jeyuchu Nithyamun ||Vijaya|| Mangalamuga Yesude Manaku Rakshana – Shrungamai Mari Nilchenu Ningin Vidichi Vachchenu Shathruni Yudhdha – Rangamanduna Gelchenu Rangu Meeragadana – Raktha Balamu Valana Pongu Nanaga Jesenu Saathaanuni Bal – Krunga Nalipi Cheelchenu ||Vijaya|| Paapamul Dolagimpanu Manalanu Dana Swa – Roopambunaku Maarpanu Shaapam Banthayu Norchenu Devuni Nyaaya – Kopamun Bhariyinchenu Paapamerugani Yesu – Paapamai Manakoraku Paapa Yaagamu Deerchenu Devuni Neethin – Dheerudai Neraverchenu ||Vijaya|| Siluva Maranamu Nondiyu Manalanu Danakai – Geluvan Lechina Vaaniki Cheluvugan Vimalaathmuni Premanu Manalo – Niluvan Jesina Vaaniki Koluvu Jethumegaani – Ilanu Maruvaka Vaani Siluva Moyuchu Nee Krupaa Rakshana Chaala Viluva Galadani Chaatuchu ||Vijaya||