విజయులం ఘన విజయులం - YouWorship
Vijayulan Ghana Vijayulang
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: విజయులం - ఘన విజయులం (2) క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం (2) 1. పరమును వీడి ధరకేతెంచి - మరణించితివి కలువరి సిలువలో (2) నీతి మంతులుగా మము తీర్చితివి (2) నూతన జీవము మాకిచ్చినందున 2. మరణ బలము నుండి విడిపించితివి - మరణ భయములను తొలగించితివి మరణము గెల్చి తిరిగి లేచితివి - సమాధి నిన్ను గెలువకపోయెను 3. శత్రు సైతానును ఓడించి - నీ సంఘమును నిర్మించితివి పాతాళ ద్వారముల్ నిలువకుండా - నీ సంఘమును కాపాడుచుంటివి 4. గొల్యాతు లెందరో హేళన చేసిరి - బబులోను రాజులు పైపైకి లేచిరి కనానీయులు కత్తులు దూసిన - యెరూషలేమును కాయుచున్న దేవా 5. శ్రమయు బాధ హింస యైనను - కరువు వస్త్ర హీనత యైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను - యెడ బాపునా మమ్ము యేసు ప్రేమ నుండి 6. లోకము శరీరము దాడి చేయుచుండగా - లోకమున్ జయించిన విజయశాలివి లోకస్థులపై విజయము నిచ్చి - విజయ విశ్వాసులుగా చేసిన దేవా 7. మహా గొప్ప మహిమతో మరల వచ్చెదవు - శత్రువు సేనలు కలవరపడగా నీ రాజ్యమును భువిపై నిలిపి - మమ్మేలు దేవా యుగా యుగములు Pallavi: Vijayulan - Ghana Vijayulan (2) Kreesthesu Prabhuvulo Athyadhika Vijayulan (2) 1. Paramunu Veedi Dharakethenchi - Maraninchithivi Kaluvari Siluvalo (2) Neethi Manthulugaa Mamu Theerchithivi (2) Noothana Jeevamu Maakichchinanduna 2. Marana Balamu Nundi Vidipinchithivi - Marana Bhayamulanu Tholaginchithivi Maranamu Gelchi Thirigi Lechithivi - Samaadhi Ninnu Geluvakapoyenu 3. Shathru Saithaanunu Odinchi - Nee Sangghamunu Nirminchithivi Paathaala Dvaaramul Niluvakundaa - Nee Sangghamunu Kaapaaduchuntivi 4. Golyaathu Lendaro Helana Chesiri - Babulonu Raajulu Paipaiki Lechiri Kanaaneeyulu Kaththulu Doosina - Yerooshalemunu Kaayuchunna Devaa 5. Shramayu Baadha Hinsa Yainanu - Karuvu Vasthra Heenatha Yainanu Upadravamainanu Khadgamainanu - Yeda Baapunaa Mammu Yesu Prema Nundi 6. Lokamu Shareeramu Daadi Cheyuchundagaa - Lokamun Jayinchina Vijayashaalivi Lokasthulapai Vijayamu Nichchi - Vijaya Vishvaasulugaa Chesina Devaa 7. Mahaa Goppa Mahimatho Marala Vachchedavu - Shathruvu Senalu Kalavarapadagaa Nee Raajyamunu Bhuvipai Nilipi - Mammelu Devaa Yugaa Yugamulu