విజయుండు క్రీస్తు ప్రభావముతో - YouWorship
Vijayundu Kreesthu Prabhaavamutho
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: విజయుండు క్రీస్తు ప్రభావముతో - ఘనవిజయుండాయెను (2) సాతానుని తలను చితుక ద్రొక్కెను (2) - సదా రాజ్యమేలును (1) 1. ఓ మరణమా నీ ముల్లు యెక్కడ? ఓ సమాధి నీ విజయమెక్కడ? (2) సిలువ శక్తితో విరుగగొట్టెను (2) - విజయుండు సర్వంబులో (1) 2. యూదా గోత్రంపు సింహమాయనే - గ్రంథమును విప్ప యోగ్యుండు తానే ఏడు ముద్రలను విప్పెడివాడు - యోగ్యుండు సర్వమందు 3. ఆయనే శిరస్సు తన సంఘమునకు - మృతులలో నుండి ప్రథముడై లేచె మన ప్రభుయేసే మరణమును గెల్చె - సర్వములో ప్రధానుడై 4. సింహాసనమందు వున్న మన ప్రభువే - పద్మరాగముల మరకతముల బోలి సూర్యకాంతివలె ప్రకాశించెను - జయమని పాడెదము 5. ఆయన యెదుట సాగిలపడి - నాలుగు జీవులు పెద్దలందరును సర్వసృష్టికి దేవుండవని - ఆరాధించి మ్రొక్కిరి 6. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు - విజయమునిచ్చె తన ద్వారా మనకు అధిక విజయము మనకిచ్చు ప్రభు,వే - అందరిలో అతిశ్రేష్టుండు Pallavi: Vijayundu Kreesthu Prabhaavamutho - Ghanavijayundaayenu (2) Saathaanuni Thalanu Chithuka Drokkenu (2) - Sadaa Raajyamelunu (1) 1. O Maranamaa Nee Mullu Yekkada? O Samaadhi Nee Vijayamekkada? (2) Siluva Shakthitho Virugagottenu (2) - Vijayundu Sarvambulo (1) 2. Yoodaa Gothrampu Sinhamaayane - Granthamunu Vippa Yogyundu Thaane Edu Mudralanu Vippedivaadu - Yogyundu Sarvamandu 3. Aayane Shirassu Thana Sangghamunaku - Mruthulalo Nundi Prathamudai Leche Mana Prabhuyese Maranamunu Gelche - Sarvamulo Pradhaanudai 4. Sinhaasanamandu Vunna Mana Prabhuve - Padmaraagamula Marakathamula Boli Sooryakaanthivale Prakaashinchenu - Jayamani Paadedamu 5. Aayana Yeduta Saagilapadi - Naalugu Jeevulu Peddalandarunu Sarvasrushtiki Devundavani - Aaraadhinchi Mrokkiri 6. Kreesthu Yesu Dvaaraa Devunike Sthuthulu - Vijayamunichche Thana Dvaaraa Manaku Adhika Vijayamu Manakichchu Prabhu,Ve - Andarilo Athishreshtundu