వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును - YouWorship
Vintimayyaa Nee Svaramu Kantimayyaa Nee Roopamunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును (1) ప్రియప్రభూ నిన్నుగాక - వేరెవరిని చూడము వినము (1) 1. భక్తి మర్మము గొప్పది యెంతో - శరీరుడుగా మారిన దేవా, (2) \దూతలకు కనబడితివి - లోకమందు నమ్మబడియున్న దేవా (2) 2. భయపడవలదని దూతలు తెల్పె -మహా సంతోషకరమైన వార్త రక్షకుడు పుట్టెనని - పరమందు మహిమ భువికి శాంతియనిరి 3. నరరూప ధారివి యైతివి ప్రభువా - అద్భుతములు చేసియున్నావు, వేరెవ్వరు చేయలేరు - అద్భుతకరుడ ఘనత కలుగును గాక 4. మూగవారికి మాటలిచ్చితివి - గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి మృతులను లేపితివి - పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా 5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి - అధికారముతో తిరిగి లేచితివి మరణపు ముల్లు విరచితివి - నమాధి నిన్ను గెలువక పోయెను 6. ఇహము నుండి పరమున కేగి - మా కొరకై నీవు రానై యున్నావు, ఆనందముతో కనిపెట్టెదము - మదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుమ్ Pallavi: Vintimayyaa Nee Svaramu - Kantimayyaa Nee Roopamunu (1) Priyaprabhoo Ninnugaaka - Verevarini Choodamu Vinamu (1) 1. Bhakthi Marmamu Goppadi Yentho - Shareerudugaa Maarina Devaa, (2) \Doothalaku Kanabadithivi - Lokamandu Nammabadiyunna Devaa (2) 2. Bhayapadavaladani Doothalu Thelpe -Mahaa Santhoshakaramaina Vaartha Rakshakudu Puttenani - Paramandu Mahima Bhuviki Shaanthiyaniri 3. Nararoopa Dhaarivi Yaithivi Prabhuvaa - Adbhuthamulu Chesiyunnaavu, Verevvaru Cheyaleru - Adbhuthakaruda Ghanatha Kalugunu Gaaka 4. Moogavaariki Maatalichchithivi - Gruddi Kuntini Baagu Jesithivi Mruthulanu Lepithivi - Paraakrama Shaalivi Neeve O Prabhuvaa 5. Preminchi Prabhuvaa Praanamichchithivi - Adhikaaramutho Thirigi Lechithivi Maranapu Mullu Virachithivi - Namaadhi Ninnu Geluvaka Poyenu 6. Ihamu Nundi Paramuna Kegi - Maa Korakai Neevu Raanai Yunnaavu, Aanandamutho Kanipettedamu - Madiyande Nireekshana Kaligi Sthuthinthum