వారు ధన్యులైన - YouWorship
Vaaru Dhanyulaina
Artist: జాన్ హే
Category: Praise & Worship
Song Lyrics
వారు ధన్యు లైన పిల్లలు - భూలోకమందు - వారు ధన్యులైన పిల్లలు= కోరి విచారమును ప్రభుని - సార వాక్య మెదను బెట్టి - వారి వారి కితరులైన - వారికిని విధేయులైన ||వారు|| 1. _అన్నదమ్ములందు నెటులను - తనతోడ నాడు - చున్న యితరులందు నటులను = భిన్న మెంచ కొక్కరీతిం - దన్నుంబోలె ప్రియ మొనర్చి - తిన్నని బడియందు నేర్చు - చున్నవార లెవ్వరో ||||వారు|| 2. _ఒకండె తండ్రి యతండు దేవుండు - మన కందరకును - సకల సుఖములిచ్చు నెప్పుడు = అకట మన మింకను జగడము - లాడందగదు ప్రభుని రీతి - నొకని నొకండు ప్రియము చేసి - యుండుద మని తలంచుచుండు ||వారు|| 3. మంచి మేలు లనుభవింపంగం - గరుణించి దేవుం - డెంచి మనల నిచటం గూర్చెంగ = వంచనలం ద్యజించి కనిక - రించి యొకనినొకండు మది స - హించి మంచి క్రియలతో వ - ర్తింప నిశ్చయింతు రెవరో ||వారు|| 4. ఆకసమున నున్న దేవుండు - మన మనసు రాక - పోక లన్ని చూచు నెప్పుడు = ఏకముగా హృదయములు వి - వేకమున వెలుంగం జేసి - ప్రాకాటముగం బ్రభుని యాజ్ఞ - గైకొనియెడి వార లెవరో ||వారు|| Vaaru Dhanyu Laina Pillalu - Bhoolokamandu - Vaaru Dhanyulaina Pillalu= Kori Vichaaramunu Prabhuni - Saara Vaakya Medanu Betti - Vaari Vaari Kitharulaina - Vaarikini Vidheyulaina ||Vaaru|| 1. _Annadammulandu Netulanu - Thanathoda Naadu - Chunna Yitharulandu Natulanu = Bhinna Mencha Kokkareethin - Dannumbole Priya Monarchi - Thinnani Badiyandu Nerchu - Chunnavaara Levvaro ||||Vaaru|| 2. _Okande Thandri Yathandu Devundu - Mana Kandarakunu - Sakala Sukhamulichchu Neppudu = Akata Mana Mingkanu Jagadamu - Laadandagadu Prabhuni Reethi - Nokani Nokandu Priyamu Chesi - Yunduda Mani Thalanchuchundu ||Vaaru|| 3. Manchi Melu Lanubhavimpanggan - Garuninchi Devun - Denchi Manala Nichatan Goorchengga = Vanchanalan Dyajinchi Kanika - Rinchi Yokaninokandu Madi Sa - Hinchi Manchi Kriyalatho Va - Rthimpa Nishchayinthu Revaro ||Vaaru|| 4. Aakasamuna Nunna Devundu - Mana Manasu Raaka - Poka Lanni Choochu Neppudu = Ekamugaa Hrudayamulu Vi - Vekamuna Velunggan Jesi - Praakaatamugan Brabhuni Yaajnya - Gaikoniyedi Vaara Levaro ||Vaaru||