వారు ఆయన తట్టుచూడగా వెలుగు కలిగెను - YouWorship
Vaaru Aayana Thattuchoodagaa Velugu Kaligenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వారు ఆయన తట్టు చూడగానే (2) - వారికి వెలుగు కలిగెను (2) 1. కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు - కాపాడును మనల ప్రతి శోధన నుండి (2) చూపించు తన మహిమ నిత్యము మనకు (2) స్థాపించును మనలను తన రాజ్యముగా (2) 2. కనుగొంటివా నీవు దేవుని మహిమ - తన కుమారుడైన యేసు ప్రభువులో తన ప్రజలను విడిపింప క్రీస్తేసు తనయుండై యిహమున జన్మించెను 3. అంత్య దినంబు వచ్చుచుండెను చూడు - చింతించెదరు పాపులందరిలలో చింతించుచు నేడే పశ్చాత్తాపముతో రా వింత రక్షణను పొంది ఆనందింతువు 4. యెహోవా తేజస్సు ఆయన శక్తితో - మహిమతో మందిరము నిండి యుండెను మహామహుని పాదముల నేడే వేడిన మహిమానందము పొంది సంతసింతువు 5. క్రీస్తు యేసు ప్రజలకు యీ భువిని - నీతి సూర్యుడు ఉదయించును మెండుగా అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును నిత్యము సంతోష గానము చేతురు 6. రక్షింపబడిన ప్రభుని జనమా - రక్షకుడేసుని స్వకీయ ధనమా రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంఘమా ముక్తి దాతను శ్లాఘించి కొనియాడుము Pallavi: Vaaru Aayana Thattu Choodagaane (2) - Vaariki Velugu Kaligenu (2) 1. Krupa Sathya Sampoornudagu Prabhuvu - Kaapaadunu Manala Prathi Shodhana Nundi (2) Choopinchu Thana Mahima Nithyamu Manaku (2) Sthaapinchunu Manalanu Thana Raajyamugaa (2) 2. Kanugontivaa Neevu Devuni Mahima - Thana Kumaarudaina Yesu Prabhuvulo Thana Prajalanu Vidipimpa Kreesthesu Thanayundai Yihamuna Janminchenu 3. Anthya Dinambu Vachchuchundenu Choodu - Chinthinchedaru Paapulandarilalo Chinthinchuchu Nede Pashchaaththaapamutho Raa Vintha Rakshananu Pondi Aanandinthuvu 4. Yehovaa Thejassu Aayana Shakthitho - Mahimatho Mandiramu Nindi Yundenu Mahaamahuni Paadamula Nede Vedina Mahimaanandamu Pondi Santhasinthuvu 5. Kreesthu Yesu Prajalaku Yee Bhuvini - Neethi Sooryudu Udayinchunu Mendugaa Athani Rekkalu Aarogyamu Nichchunu Nithyamu Santhosha Gaanamu Chethuru 6. Rakshimpabadina Prabhuni Janamaa - Rakshakudesuni Svakeeya Dhanamaa Rakthamutho Konnatti Kreesthu Sangghamaa Mukthi Daathanu Shlaaghinchi Koniyaadumu