వారాయనను జన సమాజములో ఘనపరచుదురు గాక - YouWorship
Vaaraayananu Jana Samaajamulo Ghanaparachuduru Gaaka
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక (1) వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక (1) 1. దేశనివాసుల చెడుగును బట్టి - నదుల నడవిగ జేసెను (2) నీటి బుగ్గల నెండిన - నేలగాను మార్చెను (2) 2. అడవిని నీటిమడుగుగా - మార్చివేసె నెహోవా ఎండిన నేలను నీటి - ఊటగాను మార్చెను 3. పురములు నివాసమునకై - వారేర్పరచుకొనునట్లు పొలములలో విత్తనములు చల్లి - ద్రాక్షాతోటలు నాటిరి 4. సస్య ఫల సమృద్ధి పొందు - నట్లు వాటివలన ఆయన ఆకలిగొనిన వారిని - అచ్చట కాపురముంచెను 5. మరియు ఆయన వాని నధికము - గా నాశీర్వదించగా వారి సంతానాభివృద్ధి - అధికముగా వర్ధిల్లెను 6. వారు విచార బాధ వలన - తగ్గిపోయినపుడు రాజులను తృణీకరించి - ఎడారిలో తిరుగజేసె 7. అట్టి దరిద్రుల బాధను బాపి - వారిని లేవనెత్తెను అట్టివారి వంశము మంద - వలె వృద్ధిచేసెను 8. యధార్థవంతులు దాని - చూచి సంతోషింతురు మోసము చేయువారందరు - మౌనముగా నుందురు 9. బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించును యెహోవ కృపాతిశయముల - దలంచెదరు గాక Pallavi: Vaaraayananu Janasamaajamulo Ghanaparachuduru Gaaka (1) Vaaraayananu Peddala Samaajamulo Keerthinthuru Gaaka (1) 1. Deshanivaasula Chedugunu Batti - Nadula Nadaviga Jesenu (2) Neeti Buggala Nendina - Nelagaanu Maarchenu (2) 2. Adavini Neetimadugugaa - Maarchivese Nehovaa Endina Nelanu Neeti - Ootagaanu Maarchenu 3. Puramulu Nivaasamunakai - Vaarerparachukonunatlu Polamulalo Viththanamulu Challi - Draakshaathotalu Naatiri 4. Sasya Phala Samruddhi Pondu - Natlu Vaativalana Aayana Aakaligonina Vaarini - Achchata Kaapuramunchenu 5. Mariyu Aayana Vaani Nadhikamu - Gaa Naasheervadinchagaa Vaari Santhaanaabhivruddhi - Adhikamugaa Vardhillenu 6. Vaaru Vichaara Baadha Valana - Thaggipoyinapudu Raajulanu Thruneekarinchi - Edaarilo Thirugajese 7. Atti Daridrula Baadhanu Baapi - Vaarini Levaneththenu Attivaari Vanshamu Manda - Vale Vruddhichesenu 8. Yadhaarthavanthulu Daani - Choochi Santhoshinthuru Mosamu Cheyuvaarandaru - Maunamugaa Nunduru 9. Buddhimanthulu Yee Vishaya-Mula Naalochinchunu Yehova Krupathishayamula - Dalanchedaru Gaaka