వాడబారని విశ్వాసముతో - YouWorship
Vaadabaarani Vishwaasamutho
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో (2) వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా నీ రాక కోసమై – కడబూర శబ్దముకై నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని|| మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2) సిద్ధపడియున్న వధువునై ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| లేఖనములను చూచితి – గురుతులు గమనించితి ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2) రారాజువై నీవు రావాలని ఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా (2) లోక బంధాల నుండి నీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| Vaadabaarani Vishwaasamutho Shubhapradamaina Nireekshanatho (2) Vechiyunnaanayyaa Kanipettuchunnanayyaa (2) Yesayyaa Nee Raaka Kosamai – Kadaboora Shabdamukai Nee Mahima Kosamai – Ninnu Cherutakai (2) ||Vaadabaarani|| Mokaallapai Vechithi – Kanneella Paryanthamai Beedu Baarina Nela Vaanakai – Eduru Choochina Sanghamai (2) Siddhapadiyunna Vadhuvunai Aashatho Vechaanayyaa (2) Yesayyaa ||Nee Raaka|| Lekhanamulanu Choochithi – Guruthulu Gamaninchithi Pravachana Neraverpulanni – Jaruguta Gurthinchithi (2) Raaraajuvai Neevu Raavaalani Eduru Choochuchunnaanayyaa (2) Yesayyaa ||Nee Raaka|| Neeti Korakai Vechina – Gooda Baathunu Polina Aathma Daahamu Thodanindi – Allaaduchunnanayyaa (2) Loka Bandhaala Nundi Nee Chelimi Koraanayyaa (2) Yesayyaa ||Nee Raaka||