వాగ్దానములు పొందుడి మీలో - YouWorship
Vaagdaanamulu Pondudi Meelo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు 1. ఇదివరకు మీరెవ్వరైనను - క్రీస్తు పేరట అడుగలేదుగదా మదినెంతో నిండు సంతోషముపొంది - అడుగుడి దొరుకు మీకు 2. తన మహిమ ఐశ్వర్యము చొప్పున - నివ్వ క్రీస్తు యేసు కోరియుండ మీ నేత్రములు పరమువైపు త్రిప్పి - అడుగుడి దొరుకు మీకు 3. దేవుని మందిర నిధిలోనికి - దశమ భాగములెల్ల తెండు దీవెనలు క్రుమ్మరించు నిక్కముగ - శోధించుడి దేవుని 4. ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదా ఆయనకు అర్పణం నర్పించి - శోధించుడి దేవుని 5. యెహోవా నాశ్రయించు వారికి - ఎట్టిమేలు కొదువై యుండదు యెహోవా ఉత్తముడని నమ్ముడి - రుచించి గుర్తించుడి 6. దీనుడైన నీవు మొరపెట్టగా - శ్రమలలోనుండి రక్షించెదనిన్ను తన నామమందు నమ్మిక యుంచి - రుచించి గుర్తించుడి 7. పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెను నేటినుండి సముద్రపుటలలను - పోలి నీ నీతియుండు Pallavi: Vaagdaanamulu Pondudi Meelo Prathivaadunu Vishvaasamu Chethanu Orputhoda Neppudu 1. Idivaraku Meerevvarainanu - Kreesthu Perata Adugaledugadaa Madinentho Nindu Santhoshamupondi - Adugudi Doruku Meeku 2. Thana Mahima Aishvaryamu Choppuna - Nivva Kreesthu Yesu Koriyunda Mee Nethramulu Paramuvaipu Thrippi - Adugudi Doruku Meeku 3. Devuni Mandira Nidhiloniki - Dashama Bhaagamulella Thendu Deevenalu Krummarinchu Nikkamuga - Shodhinchudi Devuni 4. Aayuraarogya Shakthisampadal Devuni Uchitha Krupayegadaa Aayanaku Arpanan Narpinchi - Shodhinchudi Devuni 5. Yehovaa Naashrayinchu Vaariki - Ettimelu Koduvai Yundadu Yehovaa Uththamudani Nammudi - Ruchinchi Gurthinchudi 6. Deenudaina Neevu Morapettagaa - Shramalalonundi Rakshinchedaninnu Thana Naamamandu Nammika Yunchi - Ruchinchi Gurthinchudi 7. Paatinchumu Devuni Aagnalan Nee Kshemamu Goppa Nadivalenu Netinundi Samudraputalalanu - Poli Nee Neethiyundu