వధియింపబడిన గొర్రెపిల్లా - YouWorship
Vadhiyimpabadina Gorrepillaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
హోలీ హోలీ… హోలీ హోలీ… (2) హోలీ హోలీ హోలీ హోలీ హోలీ… యు ఆర్ హోలీ (2) వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2) నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి… మమ్ములను కొన్నావే ప్రతి జనములో… నీ ప్రజలను… నీ యాజక రాజ్యము చేసావే రక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదే రాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదే అర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2) ||వధియింప|| అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు అధికారం ఇచ్చే మహా దేవుడవు ఆకాశ భూములయందు ఈ సృష్టి సర్వమునందు నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు నీ రాజ్యము నిలుచును నిరతము నీదేగా సర్వాధికారము నీవెవ్వరికి ఇత్తువో వారిదే ఔను భూ రాజ్యము మహోన్నతుడు యేసుని శుద్ధులదే ఈ అధికారము ||రక్షణ|| దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజల జీవులు అన్నియును నీ యందే సృజియింపబడెన్ సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారములు అందరును నీ శాసనముకు లోబడును నీ మాటతో ఏలెడి ప్రభుడవు నీవొకడివే సృష్టికి కర్తవు పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే భూ రాజులు నివాసులు తమ మహిమనంతా తెచ్చి పూజింతురే ||రక్షణ|| దావీదు చిగురువు నువ్వు – యూదా స్తుతి సింహము నువ్వు దావీదు తాళపు చెవి యజమానుడవు నువ్వు తలుపును మూసావంటే – తెరిచేటి వారే లేరు నువ్వు తెరిచిన తలుపును మూసే వారెవరు నీ భుజములపై రాజ్య భారము నీదేగా నిత్య సింహాసనము భూరాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము నిను విశ్వసించు వారికే చెందుతుంది నీ సత్య రాజ్యము ||రక్షణ|| సెరాపులు కెరూబులచే – పరిశుద్ధుడు పరిశుద్ధుడని తరతరములు కొనియాడబడే శుద్ధుడవు నీ స్తుతిని ప్రచురము చేయ – మమ్మును నిర్మించావయ్యా మా ఆరాధనకు నీవే యోగ్యుడవు నీ నామము బహు పూజనీయము ప్రతి నామమునకు పై నామము ప్రతి వాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును ||రక్షణ|| Holy Holy… Holy Holy… (2) Holy Holy Holy Holy Holy… You are Holy (2) Vadhiyimpabadina Gorrepillaa – Simhaasaanaaseenudaa (2) Nee Rakthamichchi… Praanamichchi… Mammulanu Konnaave Prathi Janamulo… Nee Prajalanu… Nee Yaajaka Raajyamu Chesaave Rakshana Gnaanamu Sthothramu – Shakthiyu Aishwaryamu Neede Raajyamu Balamu Prabhaavamu – Mahima Ghanatha Neede Arhudaa.. Yogyudaa.. Kruthagnathaku Paathrudaa (2) ||Vadhiyimpa|| Annitiki Painunnaavu – Andarini Choosthunnaavu Adhikaaram Ichche Maha Devudavu Aakaasha Bhoomulayandu – Ee Srushti Sarvamunandu Nee Chitthamu Jariginche Mahraaju Nuvvu Nee Raajyamu Niluchunu Nirathamu Needegaa Sarvaadhikaaramu Neevevvariki Itthuvo Vaaride Aunu Bhoo Raajyamu Mahonnathudu Yesuni Shuddhulade Ee Adhikaaramu ||Rakshana|| Drushyamulu Adrushyamulu – Aakaasha Bhoojala Jeevulu Anniyunu Nee Yande Srujiyimpabaden Simhaasana Prabhuthvamulu – Pradhaanulu Adhikaaramulu Andarunu Nee Shaasanamuku Lobadunu Nee Maatatho Eledi Prabhudavu Neevokadive Srushtiki Karthavu Paraloka Peddalanadaru Thama Kireetamu Theesi Ninnu Kolathure Bhoo Raajulu Nivaasulu Thama Mahimananthaa Thechchi Poojinthure ||Rakshana|| Daaveedu Chiguruvu Nuvvu – Yoodaa Sthuthi Simhamu Nuvvu Daaveedu Thaalapu Chevi Yajamaanudavu Nuvvu Thalupunu Moosaavante – Thericheti Vaare Leru Nuvvu Therichina Thalupunu Moose Vaarevaru Nee Bhujamulapai Raajya Bhaaramu Needegaa Nithya Simhaasanamu Bhooraajyamulannintini Koolagotti Nilachunu Nee Raajyamu Ninu Vishwasinchu Vaarike Chenduthundi Nee Sathya Raajyamu ||Rakshana|| Seraapulu Keroobulache – Parishuddhudu Parishuddhudani Tharatharamulu Koniyaadabade Shuddhudavu Nee Sthuthini Prachuramu Cheya – Mammunu Nirminchaavayyaa Maa Aaraadhanaku Neeve Yogyudavu Nee Naamamu Bahu Poojaneeyamu Prathi Naamamunaku Pai Naamamu Prathi Vaani Mokaalunu Prabhu Yesu Naamamanduna Vangunu Prathi Naaluka Yesude Advitheeya Prabhuvani Oppunu ||Rakshana||