వచ్చింది వచ్చింది వచ్చింది - YouWorship
Vachchindi Vachchindi Vachchindi
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2) మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ ||వచ్చింది|| రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు మెరిసిపోతున్న ఇళ్ళు – మాసిపోయాయి హృదయాలు ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు పేరుకేమో క్రైస్తవులు – తీరుమారని జనులు (2) ||ఇంటికి|| విద్యలేని పామరులు – విధేయులై బ్రతికారు విద్యవున్న సోమరులు – మందిరాలకే రారు తూర్పుదేశపు జ్ఞానులే – మోకాళ్ళు వంచినారు చదువు పదవుంటే చాలు – మోకరించరు వీరు (2) ||ఇంటికి|| దినములు చెడ్డవి గనుక – సమయమును పోనియ్యక అజ్ఞానులవలె కాక – జ్ఞానులవలె నడవాలి పాపము తీయుట కొరకే – ప్రభు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు – ఉత్సవ ఉల్లాసాలా (2) ||ఇంటికి|| Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa Maarpu Lekunda Chesthe Shuddha Dandagaa Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa Yesayya Korindi Manalo Maarpune Kadaa Intiki Rangulu Kaadu – Vantiki Hangulu Kaadu Allari Aatalu Kaadu – Thraagubothu Vindulu Kaadu (2) Maaru Manassu Kaligundutaye Christmas Apavathrithathanu Visarjinchute Christmas Daiva Prema Kaligundutaye Christmas Prabhuvu Koraku Jeevinchutaye Nija Christmas ||Vachchindi|| Rangu Rangu Vasthraalu – Muriki Guddala Manassulu Merisipothunna Illu – Maasipoyaayi Hrudayaalu Intipaina Nakshathraalu – Intilo Madyapaanaalu Perukemo Kraisthavulu – Theeru Maarani Janulu (2) ||Intiki|| Vidya Leni Paamarulu – Vidheyulai Brathikaaru Vidya Unna Somarulu – Mandiraalake Raaru Thoorpu Deshapu Gnaanule – Mokaallu Vanchinaaru Chaduvu Padavunte Chaalu – Mokarincharu Veeru (2) ||Intiki|| Dinamulu Cheddavi Ganuka – Samayamunu Poniyyaka Agnaanula Vale Kaaka – Gnaanula Vale Nadavaali Paapamu Theeyuta Korake – Prabhu Puttaadani Thelisi Paapamu Veedaka Neevu – Uthsava Ullaasaalaa (2) ||Intiki||