వందనమో వందన మేసయ్యా - YouWorship
Vandanamo Vandana Mesayyaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: వందనమో వందన మేసయ్యా (2) అందుకొనుము మా దేవా - మాదు - వందన మందుకొనుమయా (1) 1. ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములో (2) మరణము నొంది మరిలేచిన మా (2) మారని మహిమ రాజా - నీకిదే వందన మందుకొనుమయా 2. పాపిని జూచి ప్రేమను జూపి - కరుణా కరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ - ప్రేమకు సాటియే లేదిలలోన 3. ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా - దేవా హృదయార్పణ నర్పింతు 4. అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు - క్రీస్తుండా స్తుతిపాత్రుండ - స్తుతించు 5. జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ నరులపై వరదా ధరలో పోసి దురిత దూరుడ రావా - రాజా నీకిదే నా స్తుతియాగం 6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు - క్షితినిన్ చేరి స్తుతింతు 7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడ - వర్ణనాతీతుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా - నీకిదే వందనమందుకొనుమయా Pallavi: Vandanamo Vandana Mesayyaa (2) Andukonumu Maa Devaa - Maadu - Vandana Mandukonumayaa (1) 1. Dharakethinchi Dhariyinchithivaa - Nararoopamunu Naralokamulo (2) Maranamu Nondi Marilechina Maa (2) Maarani Mahima Raajaa - Neekide Vandana Mandukonumayaa 2. Paapini Joochi Premanu Joopi - Karunaa Karamuche Kalvari Kadaku Nadipinchi Kadu Prematho Kadigi Kanneetini Thudichina Nee - Premaku Saatiye Ledilalona 3. Udayinchithivaa Nannuddharimpa - Dhariyinchithivaa Daaruna Maranamu Dayathalachi Daridruni Pilichi Daarini Choopina Daathaa - Devaa Hrudayaarpana Narpinthu 4. Anaadhundanu Naa Naathundaa - Andavai Naaku Bandaga Nundu Andhuda Nenu Naa Dendamuna Nundi Nadipinchu - Kreesthundaa Sthuthipaathrunda - Sthuthinchu 5. Jagamunu Veedi Paramuna Karigi - Parishuddhathmanu Varamunu Viriviga Narulapai Varadaa Dharalo Posi Duritha Dooruda Raavaa - Raajaa Neekide Naa Sthuthiyaagan 6. Paramunundi Parishuddhalatho Paripoorna Prabhu Prabhaavamutho Pravimaludaa Prathyakshambaguduvu Akshaya Dehamu Thakshanamichchu - Kshithinin Cheri Sthuthinthu 7. Sthuthisthothraarhudaa Parama Poojyuda - Varnanaatheethudaa Dhavalavarnudaa Rathnavarnuda Rikthudavaithivi Mukthinichchina Daathaa - Neekide Vandanamandukonumayaa