వందనము నీకే నా - YouWorship
Vandanamu Neeke Naa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
వందనము నీకే నా వందనము (2) వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము|| నీ ప్రేమ నేనేల మరతు నీ ప్రేమ వర్ణింతునా (2) దాని లోతు ఎత్తునే గ్రహించి (2) నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము|| సర్వ కృపానిధి నీవే సర్వాధిపతియును నీవే (2) సంఘానికి శిరస్సు నీవే (2) నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము|| పరిశుద్ధమైన నీ నామం పరిమళ తైలము వలె (2) పరము నుండి పోయబడి (2) పరవశించి నేను పాడెదను (2) ||వందనము|| మృతి వచ్చెనే ఒకని నుండి కృప వచ్చెనే నీలో నుండి (2) కృషి లేక నీ కృప రక్షించెను (2) కృతజ్ఞతార్పణలర్పింతును (2) ||వందనము|| తండ్రియైన దేవునికే కుమారుడైన దేవునికే (2) పరిశుద్ధాత్మ దేవునికే (2) వందన వందన వందనము (2) ||వందనము|| Vandanamu Neeke Naa Vandanamu (2) Varnanakandani Neeke Naa Vandanamu (2) ||Vandanamu|| Nee Prema Nenela Marathu Nee Prema Varninthunaa (2) Daani Lothu Etthune Grahinchi (2) Nee Praana Thyaagamune Thalanchi (2) ||Vandanamu|| Sarva Krupaanidhi Neeve Sarvaadhipathiyunu Neeve (2) Sanghaaniki Shirassu Neeve (2) Naa Sangeetha Saahithyamu Neeve (2) ||Vandanamu|| Parishuddhamaina Nee Naamam Parimala Thailamu Vale (2) Paramu Nundi Poyabadi (2) Paravashinchi Nenu Paadedanu (2) ||Vandanamu|| Mruthi Vachchene Okani Nundi Krupa Vachchene Neelo Nundi (2) Krushi Leka Nee Krupa Rakshinchenu (2) Kruthagnathaarpanalarpinthunu (2) ||Vandanamu|| Thandriyaina Devunike Kumaarudaina Devunike (2) Parishuddhaathma Devunike (2) Vandana Vandana Vandanamu (2) ||Vandanamu||