వందనమయ్యా యేసు నీకు - YouWorship
Vandanamayyaa Yesu Neeku
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
వందనమయ్యా - యేసు నీకు - వందనమయ్యా - మా కోరిక - లందియ్యవయ్యా వందనమయ్య నీ సుందర పాదారవిందములకు భక్తి - వినతులు గావింతు సందియంబులులేని పరమానందమున నీయందు డెందము - పొందుపడం జేయవె యెహోవా - నందనా పాపేంధనాగ్ని ||వందనమయ్యా|| 1. నర దైవత్వములు - రెండుగూడి - పరిపూర్ణమైన - దేహాత్మలు - ధరియించి యందు లేశంబయిన - దురితంబులేని - యవతారము - నెరవుగా దాల్చి ధరణికి నేతెంచి నిరయార్హులగు సర్వ - నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము విరివిగా పరుగెత్తం జేయుచు - విమలమగు నీ ప్రాణరక్తము - లరుదుగా సమర్పణము చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ ||వందనమయ్యా|| 2. నీ పుణ్యమందు - నమ్ముకొనెడి - యే పాపియైన - తక్షణమున శాపంబుం బాసి - త్రాణగలిగి - నీ సజ్ఞనుండు - కృపవానిని - కాపాడుచుండు దీపించు భవదీయ దివ్య వాగ్దత్తంబు - లాపత్సరంపరల కడ్డుపడుచు నుండి నీ యోగద భారమెల్లను - మోసి యోపికనుండ నేర్చిన పాపి పుణ్యుండగుచు నాత్మను - భవ్య సుఖమఖిలంబుం బడయును ||వందనమయ్యా|| నిమిడియున్నట్టి - తనువు దాల్చి - క్రమముగానందు - దైవత్వము కనుపరచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య - సముదయమునకు నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువు - జంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా|| Vandanamayyaa - Yesu Neeku - Vandanamayyaa - Maa Korika - Landiyyavayyaa Vandanamayya Nee Sundara Paadaaravindamulaku Bhakthi - Vinathulu Gaavinthu Sandiyambululeni Paramaanandamuna Neeyandu Dendamu - Pondupadam Jeyave Yehovaa - Nandanaa Paapendhanaagni ||Vandanamayyaa|| 1. Nara Daivathvamulu - Rendugoodi - Paripoornamaina - Dehaathmalu - Dhariyinchi Yandu Leshambayina - Durithambuleni - Yavathaaramu - Neravugaa Daalchi Dharaniki Nethenchi Nirayaarhulagu Sarva - Narula Rakshimpa Nee Karunaa Pravaahamu Virivigaa Parugeththam Jeyuchu - Vimalamagu Nee Praanarakthamu - Larudugaa Samarpanamu Chesiyu Thirigi Lechithivo Mahaa Prabhoo ||Vandanamayyaa|| 2. Nee Punyamandu - Nammukonedi - Ye Paapiyaina - Thakshanamuna Shaapambum Baasi - Thraanagaligi - Nee Sajnyanundu - Krupavaanini - Kaapaaduchundu Deepinchu Bhavadeeya Divya Vaagdaththambu - Laapathsaramparala Kaddupaduchu Nundi Nee Yogada Bhaaramellanu - Mosi Yopikanunda Nerchina Paapi Punyundaguchu Naathmanu - Bhavya Sukhamakhilambum Badayunu ||Vandanamayyaa|| Nimidiyunnatti - Thanuvu Daalchi - Kramamugaanandu - Daivathvamu Kanuparachinaavu Vimalopadeshamul Vividhambugaa Shishya - Samudayamunaku Nuththamugaa Bodhinchi Yamitha Paapaharambunaku Bhuvinavatharinchina Menu Siluvanu Shramanu Mruthikalpinchi Mruthyuvu - Jampi Jeevinchina Mahaathmaa ||Vandanamayyaa||