వందనంబొనర్తుమో - YouWorship
Vandanambonarthumo Prabho
Artist: మత్తయి సమూయేలు
Category: Thanksgiving
Song Lyrics
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో ||వందనం|| ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి ఎపుడు గాచియు ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాలి తనువు దినములన్నియు నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం|| కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం|| మా సభలను పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నందకార మంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం|| Vandanambonarthumo Prabho Prabho Vandanambonarthumo Prabho Prabho Vandanambu Thandri Thanaya Shudhdhaathmudaa Vandanambu Landuko Prabho ||Vandanam|| Inni Naallu Dharanu Mammu Brochiyu Ganna Thandri Minchi Epudu Gaachiyu Ennaleni Deevene Lidu Nanna Yesuvaa Yanni Retlu Sthothramulivigo ||Vandanam|| Praatha Vathsarampu Baapa Manthayu Breethini Manninchi Mammu Gaavumu Nootha Naabdamunanu Needu Neethi Nosagumaa Daatha Kreesthu Naatha Rakshakaa ||Vandanam|| Deva Maadu Kaalu Sethu Lellanu Sevakaali Thanuvu Dinamulanniyu Nee Vosangu Vendi Pasidi Gnaanamantha Nee Sevakai Yangeekarinchumaa ||Vandanam|| Kotha Koraku Daasa Janamu Nampumu Ee Thari Maa Lotupaatlu Deerchumu Paathakambu Lella Maapi Bheethi Baapumu Khyaathi Nondu Neethi Sooryudaa ||Vandanam|| Maa Sabhalanu Peddajesi Penchumu Nee Suvaartha Jeppa Shakthi Neeyumu Mosapuchchu Nandhakaara Mantha Droyumu Yesu Krupan Gummarinchumu ||Vandanam||