లోకం, జీవం, మరణంబైనన్ - YouWorship
Lokan, Jeevan, Maranambainan
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: లోకం, జీవం, మరణంబైనన్ - సకలము మీవె నిజం - స్థిరముగ నమ్ముడిలన్ (2) 1. ప్రస్తుతమందు ఉన్నవియైనన్ - రాబోవునట్టివియైనను (2) వాస్తవముగా సమస్తము మీవె (2) - మీరేసుని వారు (1) 2. తన్ను ప్రేమించుచుండెడి వారికి - దేవుడు వేటిని సిద్దపరచెనో కన్నులకు గోచరము కావవి - చెవులకు వినబడవు 3. హృదయములకు అగోచరమైనవి - మరుగైయుండె లోకజ్ఞానులకు పదిలముగా ప్రభు సహాయముతో - నేరుగు మీ మర్మమును 4. అక్షయమైనది నిర్మలమైనది - వాడబారనిది మీ స్వాస్థ్యము రక్షకుడేసు భద్రపరచెను - పరమున మీకొరకు 5. అసమానమగు శక్తిచే మిమ్మున్ - నిత్యముకాచి భద్రపరచును యేసు ఆ కడవరి రక్షణ మీకు - నిచ్చు విశ్వసించు 6. మీరే దేవుని పుత్రులటంచు - ఆత్మయే సాక్షమిచ్చు చున్నాడు వారసులగు మీరు శ్రమపడిన - మహిమను పొందెదరు 7. జయించువాడు వీటన్నిటిని - స్వాతంత్రించుకొను నిక్కముగా ఆయనే మీకు దేవుడైయుండు - మీరాయన సుతులు Pallavi: Lokan, Jeevan, Maranambainan - Sakalamu Meeve Nijan - Sthiramuga Nammudilan (2) 1. Prasthuthamandu Unnaviyainan - Raabovunattiviyainanu (2) Vaasthavamugaa Samasthamu Meeve (2) - Meeresuni Vaaru (1) 2. Thannu Preminchuchundedi Vaariki - Devudu Vetini Siddaparacheno Kannulaku Gocharamu Kaavavi - Chevulaku Vinabadavu 3. Hrudayamulaku Agocharamainavi - Marugaiyunde Lokagnaanulaku Padilamugaa Prabhu Sahaayamutho - Nerugu Mee Marmamunu 4. Akshayamainadi Nirmalamainadi - Vaadabaaranidi Mee Svaasthyamu Rakshakudesu Bhadraparachenu - Paramuna Meekoraku 5. Asamaanamagu Shakthiche Mimmun - Nithyamukaachi Bhadraparachunu Yesu Aa Kadavari Rakshana Meeku - Nichchu Vishvasinchu 6. Meere Devuni Puthrulatanchu - Aathmaye Saakshamichchu Chunnaadu Vaarasulagu Meeru Shramapadina - Mahimanu Pondedaru 7. Jayinchuvaadu Veetannitini - Svaathanthrinchukonu Nikkamugaa Aayane Meeku Devudaiyundu - Meeraayana Suthulu