లే నిలబడు - YouWorship
Le Nilabadu
Artist: పి సాల్మన్
Category: Encouraging
Song Lyrics
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు ||లే నిలబడు|| రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం ||లే నిలబడు|| సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం ||లే నిలబడు|| Le Nilabadu Parugidu Thandri Pani Kosame Nee Manasulo Prabhuvunu Koluchu Prathi Nimishame Sangrahinchu Gnaanamanthaa – Sancharinchu Lokamanthaa Ninnu Aapu Shakthi Kaladaa Lokamandunaa Neeku Thodu Needa Laaga – Thandri Aathmanivvaledaa Piriki Aathma Needi Kaadu Parugu Aapaku Neetiloni Chepalaagaa Eduru Eetha Nerchuko Pakshi Raaju Pattudalatho Pourushamgaa Saagipo Kadile.. Nadilaa.. Eduruga Nilabadu Alalaku Jadiyaku ||Le Nilabadu|| Raalla Thoti Kottabadina Suvaarthani Aapakundaa Pattudalatho Cheppinatti Sthephanu Neeku Maadiri Yesu Bodha Cheyakantu Elikale Ekamaithe Rommu Virichi Cheppinatti Aposthalule Maadiri Eduru Vasthe Kaisarainaa Eduru Thirugu Nesthamaa Beduru Pedithe Evvadainaa Nidurapokumaa Manasu Ninda Vaakyamunte Manishi Ninnu Aapaledu Aathmakunna Aashayamtho Kadulu Munduku Sajjana Dweshulu Ilalo Sahajam Prabhuvuke Thappaledu Maranam ||Le Nilabadu|| Sontha Kanna Biddalanthaa Vidichi Petti Vellipothe Ontaraina Thalli Mariya Neti Sthreeki Maadiri Ilanu Soukhyamentha Unna Penta Thoti Polchukunna Parama Thyaagi Poulu Gaari Theguva Manaku Maadiri Brathuku Oda Baddalainaa Thaggipoku Thandri Panilo Tharigiponi Swaasthyamundi Thandri Chenthana Cheranu Koodaa Chintha Marachi Kalamu Patti Raasukunna Prabhuni Priyudu Maargadarshi Manaku Sodari Gothilona Daachaku Muthyam Lekka Aduguthaadidi Sathyam ||Le Nilabadu||