లేలెమ్ము సోదరీ సోదరుడా - YouWorship
Lelemmu Sodaree Sodarudaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
"నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించును." ఎఫెసీయులకు Ephesians 5:14 పల్లవి : లేలెమ్ము సోదరీ సోదరుడా - రక్షకుడేసుని సేవింప 1. సత్యముతో ఆత్మతో దేవుని - సన్నిధి జేరి ఆరాధింప ఆశ్చర్యకరుడు ఆలోచన - కర్త బలవంతుడు ప్రభుయేసు || లేలెమ్ము || 2. రాజాధిరాజు మన ప్రభుయేసు - రాజ్యము నీయ మనకై వచ్చున్ రాజైన యేసు విజయము కల్గి - విజయుండు యేసుని చాటెదము || లేలెమ్ము || 3. షద్రకు మేషాక బెద్నాగో - పౌరుషముతోడ ప్రభుశ్రమ నోర్చె కరువైనను మీకు శ్రమలైన - కరుణించుచు ప్రభు మీతో నడుచున్ || లేలెమ్ము || 4. స్తెఫెనాది అపొస్తలులంత - అపవిత్రమైన ప్రజలమధ్య కృపాళుదైన యేసుని చాటె - కృపనొందుచు ప్రభుని చాటండి || లేలెమ్ము || 5. అర్పించుడి మీదు హృదయములన్ - నెరవేర్చను దేవుని చిత్తమును కర్తను సేవింపగను లెండి - వీరులుగా దావీదు వలెను || లేలెమ్ము || 6. యౌవనేచ్ఛలను విసర్జించి - యౌవన రక్తముతో మిము గొన్న పావనుడగు యేసు ప్రభువునకై - చావను వెనుదీయక రారండి || లేలెమ్ము || 7. జీవించువాడనే కానంచు - జీవించుట ప్రభు కొరకే యంచు గావించుము ప్రభు పనులిలలోన - జీవించు ప్రభు కొరకే యిలలో || లేలెమ్ము || "Nidrinchuchunna Neevu Melkoni Lemmu. Kreesthu Nee Meeda Prakaashinchunu." Epheseeyulaku Ephesians 5:14 Pallavi : Lelemmu Sodaree Sodarudaa - Rakshakudesuni Sevimpa 1. Sathyamutho Aathmatho Devuni - Sannidhi Jeri Aaraadhimpa Aashcharyakarudu Aalochana - Kartha Balavanthudu PrabhuYesu || Lelemmu || 2. Raajaadhiraaju Mana PrabhuYesu - Raajyamu Neeya Manakai Vachchun Raajaina Yesu Vijayamu Kalgi - Vijayundu Yesuni Chaatedamu || Lelemmu || 3. Shadraku Meshaaka Bednaago - Paurushamuthoda Prabhushrama Norche Karuvainanu Meeku Shramalaina - Karuninchuchu Prabhu Meetho Naduchun || Lelemmu || 4. Sthephenaadi Aposthalulantha - Apavithramaina Prajalamadhya Krupaludaina Yesuni Chaate - Krupanonduchu Prabhuni Chaatandi || Lelemmu || 5. Arpinchudi Meedu Hrudayamulan - Neraverchanu Devuni Chiththamunu Karthanu Sevimpaganu Lendi - Veerulugaa Daaveedu Valenu || Lelemmu || 6. Yauvanechchhalanu Visarjinchi - Yauvana Rakthamutho Mimu Gonna Paavanudagu Yesu Prabhuvunakai - Chaavanu Venudeeyaka Raarandi || Lelemmu || 7. Jeevinchuvaadane Kaananchu - Jeevinchuta Prabhu Korake Yanchu Gaavinchumu Prabhu Panulilalona - Jeevinchu Prabhu Korake Yilalo || Lelemmu ||