లేచినాడురా సమాధి గెలిచినాడురా - YouWorship
Lechinaaduraa Samaadhi Gelichinaaduraa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| లేచినాడురా - సమాధి గెలిచినాడురా - యేసు లేచినాడురా - సమాధి గెలిచినాడురా అ||ప|| లేతునని తా జెప్పినట్టు - లేఖనములలో పలికినట్లు ||లేచి|| 1. భద్రముగ సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న ||లేచి|| 2. ప్రభువు దూత పరమునుండి - త్వరగ దిగి రాతిని పొర్లించి దానిపై కూర్చుండె - భయము నొంద కావలివారు ||లేచి|| 3. ప్రొద్దు పొడవకముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చిచూడ ||లేచి|| 4. చూడవెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ లేడు గలిలయ ముందుగ పోతున్నాడు - అపుడె లేచినాడని ||లేచి|| ర్. చచ్చిపోయి లేచినాడు - స్వామిభక్తు లకగుపడినవాడు చచ్చినను నను లేపుతాడు - చావు అంటె భయపడరాదు ||లేచి|| 6. నేను చేసే పనులనెరుగు - నేను నడిచే మార్గమెరుగు నేను చెప్పు మాటలెరుగు - నేనుబ్రతికే (బ్రతుకునెరుగు ||లేచి|| 7. నేను లేచిన యేసునందు - మానక మదినమ్ము కొందు - తాను నాలోయుండినందున - దయను జేర్చును మోక్షమందు ||లేచి 8. పాపభారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరకబాధ లేదు మనకు - మరువకండి యేసుప్రభుని ||లేచి|| 9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవం యేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం ||లేచి|| 10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించాడు పాపులను (ప్రేమించానాడు - ప్రాణదానము చేసినాడు ||లేచి|| Pa|| Lechinaaduraa - Samaadhi Gelichinaaduraa - Yesu Lechinaaduraa - Samaadhi Gelichinaaduraa A||Pa|| Lethunani Thaa Jeppinattu - Lekhanamulalo Palikinatlu ||Lechi|| 1. Bhadramuga Samaadhipaini - Peddaraathini Yunchiri Bhatulu Mudravesi Raathriyantha Nidraleka Kaavaliyunna ||Lechi|| 2. Prabhuvu Dootha Paramunundi - Thvaraga Digi Raathini Porlinchi Daanipai Koorchunde - Bhayamu Nonda Kaavalivaaru ||Lechi|| 3. Proddu Podavakamunde Sthreelu Siddhaparachina Sugandhamulu Shraddhathoda Thechchi Yesuku - Ruddudaamani Vachchichooda ||Lechi|| 4. Choodavellina Sthreelanu Dootha - Choochi Yapude Vaarithoda Ledu Galilaya Munduga Pothunnaadu - Apude Lechinaadani ||Lechi|| R. Chachchipoyi Lechinaadu - Svaamibhakthu Lakagupadinavaadu Chachchinanu Nanu Leputhaadu - Chaavu Ante Bhayapadaraadu ||Lechi|| 6. Nenu Chese Panulanerugu - Nenu Nadiche Maargamerugu Nenu Cheppu Maatalerugu - Nenubrathike (Brathukunerugu ||Lechi|| 7. Nenu Lechina Yesunandu - Maanaka Madinammu Kondu - Thaanu Naaloyundinanduna - Dayanu Jerchunu Mokshamandu ||Lechi 8. Paapabhaaramu Ledu Manaku Marana Bhayamu Ledu Manaku Narakabaadha Ledu Manaku - Maruvakandi YesuPrabhuni ||Lechi|| 9. Yesunande Rakshanabhaagyan - Yesunande Nithyajeevan Yesunande Aathmashaanthi - Yesunande Mokshabhaagyan ||Lechi|| 10. Paapulakai Vachchinaadu - Paapulanu Karuninchaadu Paapulanu (Preminchaanaadu - Praanadaanamu Chesinaadu ||Lechi||