లెమ్ము తేజరిల్లుము అని - YouWorship
Lemmu Thejarillumu Ani
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
లెమ్ము తేజరిల్లుము అని నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము (2) శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి (2) ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత (2) జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసితివి (2) ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత…. ఇదియే నా ధన్యత ||లెమ్ము|| తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము (2) తేజోమయమైన షాలోము నగరులో నిను చూసి తరింతునే (2) ఇదియే దర్శనము… ఇదియే దర్శనము… ఇదియే నా దర్శనము ||లెమ్ము|| Lemmu Thejarillumu Ani Nanu Uttheja Parachina Naa Yesayya (2) Ninne Smarinchukonuchu Nee Saakshigaa Prakaashinchuchu Raajaadhiraajuvani Prabhuvula Prabhuvani Ninu Venollatho Prakatincheda (2) Unnatha Pilupunu Nirlakshyaparachaka Neetho Naduchute Naa Bhaagyamu (2) Shaashwatha Prematho Nanu Preminchi Nee Krupa Choopithivi (2) Idiye Bhaagyamu… Idiye Bhaayamu.. Idiye Naa Bhaagyamu ||Lemmu|| Shramalalo Nenu Intha Varakunu Neetho Niluchute Naa Dhanyathaa (2) Jeeva Kiretamu Ne Pondutake Nanu Chera Deesithivi (2) Idiye Dhanyathaa.. Idiye Dhanyathaa… Idiye Naa Dhanyathaa ||Lemmu|| Thejovaasula Swaasthyamu Nenu Anubhavinchute Naa Darshanamu (2) Thejomayamaina Shaalomu Nagarulo Ninu Choosi Tharinthune (2) Idiye Darshanamu.. Idiye Darshanamu… Idiye Naa Darshanamu ||Lemmu||