రేయింపగలు నీ పదసేవే - YouWorship
Reyimpagalu Nee Padaseve
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప|| రేయింపగలు నీ పదసేవే - యేసు ప్రభువా - చేయుటమేలు సాటిలేని దేవుడ నీవె - నాదు కోట కొండయు నీవె 1. పరమపురిలో వరదా నిరతం - దూతగణముల స్తుతులను సల్పి పరిశుద్ధుడనుచు - పూజనొందె దేవుడ నీవె ||రేయి|| 2. జిగటమన్నే మానవులంతా - పరమకుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు - సృష్టిని పూజించుట తగునా ||రేయి|| 3. పెంటకుప్పలనుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలు దింపి- ఘనులనైనా మేపవ గడ్డి 4. నరుల నమ్ముట కంటె నిజముగ - నీదు శరణం శరణం దేవా రాజులను ధరనమ్ముటకంటె - రాజరాజవు నాకాశ్రయము ||రేయి|| ర్. అగ్నివాసననంటకుండా - అబెద్నగోలతో నుండి నదేవా - దానియేలును సింహపుబోనులో - ఆదుకొన్న నాధుడనీవె ||రేయి|| 6. పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు - వరము చేర్చు పదము నీవే అడుగుజాడల నడచిన - హనోకు - పరముచేరె ప్రాణముతోడ ||రేయి|| 7. మృతుల సహితము లేపినావు - మృతినిగెల్చి లేచినావు మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతిలేపినావు ||రేయి|| Pa|| Reyimpagalu Nee Padaseve - Yesu Prabhuvaa - Cheyutamelu Saatileni Devuda Neeve - Naadu Kota Kondayu Neeve 1. Paramapurilo Varadaa Nirathan - Doothaganamula Sthuthulanu Salpi Parishuddhudanuchu - Poojanonde Devuda Neeve ||Reyi|| 2. Jigatamanne Maanavulanthaa - Paramakummari Prabhudavu Neeve Srushtikarthanu Marachi Janulu - Srushtini Poojinchuta Thagunaa ||Reyi|| 3. Pentakuppalanundi Deenula - Paikilepu Prabhudavu Neeve Garvamanachi Gaddelu Dimpi- Ghanulanainaa Mepava Gaddi 4. Narula Nammuta Kante Nijamuga - Needu Sharanan Sharanan Devaa Raajulanu Dharanammutakante - Raajaraajavu Naakaashrayamu ||Reyi|| R. Agnivaasananantakundaa - Abednagolatho Nundi Nadevaa - Daaniyelunu Sinhapubonulo - Aadukonna Naadhudaneeve ||Reyi|| 6. Paramagurudavu Prabhulaku Prabhudavu - Varamu Cherchu Padamu Neeve Adugujaadala Nadachina - Hanoku - Paramuchere Praanamuthoda ||Reyi|| 7. Mruthula Sahithamu Lepinaavu - Mruthinigelchi Lechinaavu Mruthulanella Lepevaadavu - Mruthyuvunu Mruthilepinaavu ||Reyi||