రావయ్యా యేసయ్యా - YouWorship
Raavayyaa Yesayyaa
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Commitment
Song Lyrics
రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని… రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని (2) కన్నులార నిన్ను చూడాలని (2) కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| యదార్థ హృదయముతో నడచుకొందును ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2) భక్తిహీనుల క్రియలు నాకంటనీయను మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను నా పొరుగు వారిని దూషింపను (2) అహంకారము గర్వము నంటనీయను నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా|| నిర్దోష మార్గముల నడచుకొందును మోసము నా ఇంట నిలువనీయను (2) అబద్ధికులెవ్వరిని ఆదరింపను భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా|| Raavayyaa Yesayyaa Naa Intiki Nee Raakakai Ne Vechiyuntini… Raavayyaa Yesayyaa Naa Intiki Nee Raakakai Ne Vechiyuntini (2) Kannulaara Ninnu Choodaalani (2) Kaachukoni Unnaanu Vechi Ne Unnaanu (2) ||Raavayyaa|| Yadaartha Hrudayamutho Nadachukondunu Ae Dushkaaryamunu Kanula Yeduta Unchukonanu (2) Bhakthiheenula Kriyalu Naakantaneeyanu Moorkha Chitthula Nundi Tholagipodunu (2) ||Raavayyaa|| Doushtyamu Nenennadu Anusarimpanu Naa Porugu Vaarini Dooshimpanu (2) Ahankaaramu Garvamu Nantaneeyanu Nammakasthuniga Ne Nadachukondunu (2) ||Raavayyaa|| Nirdosha Maargamula Nadachukondunu Mosamu Naa Inta Niluvaneeyanu (2) Abaddhikulevvarini Aadarimpanu Bhakthiheenula Maargamu Ne Throkkanu (2) ||Raavayyaa||