రారే రారే ఓ జనులారా - YouWorship
Raare Raare O Janulaaraa
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్ సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2) పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట లోకాన పండగంట (2) ||రారే|| మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2) మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే|| రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2) పాప భారము మోసి మరణ కోరలు విరచి శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2) ||రారే|| Raare Raare O Janulaaraa Vegame Raarandoi Sakkanaina Baala Yesuni Choothamu Raarandoi (2) Paapaalu Baapunanta – Rogaalu Theerchunanta Lokaana Pandaganta (2) ||Raare|| Manushula Paapamu Baapa Mahimane Veedaadanta Manishigaa Puttetanduku Dharaniki Vachchaadoi (2) Mahima Raajyamu Naadu Manakeeya Puttenule Mahimaa Swaroopudu Maranaaniki Thala Oggaadoi (2) ||Raare|| Raajula Raajuga Yesu Raajyame Manakeeyaganu Paapapu Daasyamu Nundi Vidudala Nichchutaku (2) Paapa Bhaaramu Mosi Marana Koralu Virachi Shaashwatha Jeevamunivvaga Maranamu Gelichaadoi (2) ||Raare||