రారే మన యేసు స్వామిని - YouWorship
Raare Mana Yesu Swaamini
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise
Song Lyrics
రారే మన యేసు స్వామిని జూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మిని గూరిమి భక్తుల జేరువ విందట భూరిద యామృత సారము లొలికెడు చారు కటాక్ష వి – శాలేక్షనుడట నారకులగు నర – నారీ జనులకు దారక మొసగను దానే పిలుచునట దారుణ పాప మ-హారణ్యమునకు గారు చిచ్చు గతి గన్పడువాడట ఘోర దరిద్రత గూల్చెడి వాడట సారంబగు తన సభకు మకుటమాట ||రారే|| పతిత పావనమౌ వేల్పట అనాది దేవ సుతుడై – ఇల జేరినాడట సతతము కడు దురి – తతమోయుతమగు ప్రతి దేశమునకు – హిత భాస్కరుడట అతులిత మోక్షో – న్నత గుణగణుడట కుతలంబున స-ద్గతి రహితంబగు పతితుల గావను – మృతుడైనాడట అతి పుణ్య తను – క్షత శోణితమును వ్రతముగ సిలువను నతఁడొసంగెనట మృతిని జయించుచు బ్రతికి లేచెనట మతి నమ్మిన మన గతి యితడేనట ||రారే|| తుదలేని మహిమ వాడట తను గొల్చు సాధు – హృదయుల సొమ్ము మూటట చెదరిన గొర్రెల – వెదక వచ్చెనట చిదురుపలగు జన హృదయములన్నిట బదిలముగా నె-మ్మది నిడువాడట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తను – బలికినవాడట సదయత సంధుల – కక్షుల నిడెనట వెదకి బధిరులకు – వీనులొసగె నట సదమల మోక్ష ప్రభుడగు విభుడట యిదిగో మనకిత డేలినవాడట ||రారే|| Raare Mana Yesu Swaamini Joothamu Korke – Loora Priyulaaraa Permini Goorimi Bhakthula Jeruva Vindata Bhoorida Yaamrutha Saaramu Lolikedu Chaaru Kataaksha Vi – shaalekshanudata Naarakulagu Nara – Naaree Janulaku Daaraka Mosaganu Daane Pilachunata Daaruna Paapa Ma-haaranyamunaku Gaaru Chichchu Gathi Ganpaduvaadata Ghora Daridratha Goolchedi Vaadata Saarambagu Thana Sabhaku Makutamata ||Raare|| Pathitha Paavanamou Velpata Anaadi Deva Suthudai – Ila Jerinaadata Sathathamu Kadu Duri – Thathamoyuthamagu Prathi Deshamunaku – Hitha Bhaaskarudata Athulitha Moksho – nnatha Gunaganudata Kuthalambuna Sa-dgathi Rahithambagu Pathithula Gaavanu – Mruthudainaadata Athi Punya Thanu – Kshatha Shonithamunu Vrathamuga Siluvanu Nathadosangenata Mruthini Jayinchuchu Brathiki Lechenata Mathi Nammina Mana Gathi Yithadenata ||Raare|| Thudaleni Mahima Vaadata Thanu Golchu Saadhu – Hrudayula Sommu Mootata Chedarina Gorrela – Vedaka Vachchenata Chidurupalagu Jana Hrudayamulannita Badilamugaa Ne-mmadi Niduvaadata Nadithata Mata Jana Vadanamula Sa mmada Shubhavaarthanu – Balikinavaadata Sadayatha Sandhula – Kakshula Nidenata Vedaki Badhirulaku – Veenulosage Nata Sadamala Moksha Prabhudagu Vibhudata Yidigo Manakitha Delinavaadata ||Raare||