రారే చూతము - YouWorship
Raare Choothamu
Artist: చెట్టి భానుమూర్తి
Category: Christmas
Song Lyrics
రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను (2) రాజులకు రారాజు మెస్సయ్యా (2) రాజితంబగు తేజమదిగో (2) ||రారే|| దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2) దేవుడే మన దీనరూపున (2) ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే|| కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం (2) తెల్లగానదే తేజరిల్లెడి (2) తార గాంచరే త్వరగ రారే (2) ||రారే|| బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు (2) బాల బాలిక బాలవృద్ధుల (2) నేల గల్గిన నాథుడు (2) ||రారే|| యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె (2) సదమలంబగు మదిని గొల్చిన (2) సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే|| Raare Choothamu Raaja Suthuni Reyi Jananamaayenu (2) Raajulaku Raaraaju Messayyaa (2) Raajithambagu Thejamadigo (2) ||Raare|| Dootha Ganamulan Deri Choodare Daiva Vaakkulan Delpagaa (2) Devude Mana Deena Roopuna (2) DHarani Karige-Nee Dinamuna (2) ||Raare|| Kalla Gaadidi Kalayu Gaadidi Golla Boyula Darshanam (2) Thellagaanade Thejarilledi (2) Thaara Gaanchare Thvaraga Raare (2) ||Raare|| Baalu-dadugo Vela Sooryula Bolu Sadguna Sheeludu (2) Baala Baalika Baala Vrudhdhula (2) Nela-galgina Naathudu (2) ||Raare|| Yooda Vamshamu Nuddarimpa Daaveedu Puramuna Nudbhavinche (2) Sadamalambagu Madini Golchina (2) Sarva Janulaku Saarvabhoumudu (2) ||Raare||