రారాజు పుట్టాడోయ్ - YouWorship
Raaraaju Puttaadoi
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
రారాజు పుట్టాడోయ్ మా రాజు పుట్టాడోయ్ సూడంగ రారండోయ్ వేడంగ రారండోయ్ (2) ఈ లోకమునకు రక్షకుడిగ పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే… ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్… ||రారాజు|| వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగ మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలోన ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై….. ||రారాజు|| మచ్చలేని ముత్యమల్లె పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లె కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగా సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడెనంట మరువని బంధమై….. ||రారాజు|| Raaraaju Puttaadoi Maa Raaju Puttaadoi Soodanga Raarandoi Vedanga Raarandoi (2) Ee Lokamunaku Rakshakudiga Puttinaadandoi Mana Koraku Deva Devudu Digi Vachchinaadandoi Ningi Nela Pongipoye… Aa Thaara Velasi Murisipoye.. Sambaramaayene Hoy ||Raaraaju|| Vennela Velugullo Poosenu Sali Manta Ooru Vaada Vinthaboye Gollala Savvadulu Kannula Vindugaa Doothalu Paadagaa Sandade Sindeyanga Minnula Pandaga Sukkallo Sandrudalle Sooda Sakkanodanta Pashuvula Paakalona Aa Pasi Baaludanta Cheragani Snehamai… ||Raaraaju|| Machchaleni Muthyamalle Podise Sooreedu Manasuloi Deepamai Daari Soopu Devudu Prema Pongu Sandramalle Kantiki Reppalaa Andari Thodu Needai Maayani Mamathalaa Sllangaa Sooda Yesu Ila Vachchinaadanta Varamuga Chera Yesu Paramunu Veedenanta Maruvani Bandhamai… ||Raaraaju||