రారండి యేసు పాదముల చేర పాప విముక్తి పొంద - YouWorship
Raarandi Yesu Paadamula Chera Paapa Vimukthi Ponda
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: రారండి యేసు పాదముల చేర - పాప విముక్తి పొంద (2) అను పల్లవి: వచ్చువారల త్రోయనని - నెచ్చెలు డేసు వాక్కు నిచ్చెను (2) రారండి (1) 1. జాగేల పాపి నీవింకను చావునకు తప్పెదవా? (2) సద్గురు చరణము వెదకిన - సద్గుణముగ నిను మార్చును (2) 2. ఆశతో యేసు నిలిచియున్నాడు -పాపీ - నిన్ను రక్షింపను జీవితము మోసమగుచున్నది - పాపీ - యేసుని రక్షణ వెదుక 3. నేడే నే మరణించిన నెచట చేరుదునని తలచి యేసుని చెంత రమ్ము తరుణము - దొరుకదు గుణపడుము వేగమే 4. ఈ ప్రేమ ఉత్కృష్టమని యెంచి వెంటనే రారమ్ము నీదు పాపముల క్షమింపను - నాథు డేసుడు సిల్వ నెక్కెను 5. పాపము శాపము తోడను వచ్చెదనని చెప్పుము జీవ దేవాది దేవుడు నీకై - చేయునదెల్ల పరికింపను 6. మాయవేషముల ధరియించి కాలము వ్యర్థపరచి తప్పుడు బోధ చేయువారల - వీడి పరమున జేరనిచటకు 7. కడపటి కాలమిదే యగును ఇల మోసపోకుడి మిత్రుడేసుడు మీకు ఇచ్చిన - దాని పొందుచు పాడు డల్లెలూయా Pallavi: Raarandi Yesu Paadamula Chera - Paapa Vimukthi Ponda (2) Anu Pallavi: Vachchuvaarala Throyanani - Nechchelu Desu Vaakku Nichchenu (2) Raarandi (1) 1. Jaagela Paapi Neevingkanu Chaavunaku Thappedavaa? (2) Sadguru Charanamu Vedakina - Sadgunamuga Ninu Maarchunu (2) 2. Aashatho Yesu Nilichiyunnaadu -Paapee - Ninnu Rakshimpanu Jeevithamu Mosamaguchunnadi - Paapee - Yesuni Rakshana Veduka 3. Nede Ne Maraninchina Nechata Cherudunani Thalachi Yesuni Chentha Rammu Tharunamu - Dorukadu Gunapadumu Vegame 4. Ee Prema Uthkrushtamani Yenchi Ventane Raarammu Needu Paapamula Kshamimpanu - Naathu Desudu Silva Nekkenu 5. Paapamu Shaapamu Thodanu Vachchedanani Cheppumu Jeeva Devaadi Devudu Neekai - Cheyunadella Parikimpanu 6. Maayaveshamula Dhariyinchi Kaalamu Vyarthaparachi Thappudu Bodha Cheyuvaarala - Veedi Paramuna Jeranichataku 7. Kadapati Kaalamide Yagunu Ila Mosapokudi Mithrudesudu Meeku Ichchina - Daani Ponduchu Paadu Dallelooyaa