రవికోటి తేజుడు - YouWorship
Ravikoti Thejudu
Artist: క్రాంతి చేపూరి
Category: Praise
Song Lyrics
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు నా దేవుడే నాకు మార్గ దర్శకుడు నా దేవుడే నాకు నిత్య పోషకుడు నా దేవుడే నాకు జీవన దాయకుడు గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే ||నా దేవుడే|| శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని|| వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని|| Naa Devude Naaku Praana Snehithudu Naa Devude Naaku Maarga Darshakudu Naa Devude Naaku Nithya Poshakudu Naa Devude Naaku Jeevanadaayakudu Gathi Leni Nannu Vedakina – Athi Kaankshaneeyudaayane Mithi Leni Prema Choopina – Ravikoti Thejudaayane ||Naa Devude|| Shramalalo Naa Thodugaa Nannu Nadipinchenu Naa Needagaa Vennantiyunna Naa Praana Naathudu Maranapu Sankella Nundi Nannu Vidipinchenu Naa Bandhakaalanni Thenchi Vesina Naa Neethi Sooryudu Kshanamaina Maruvani Veedani Naa Kshemaa Shikharamu Kshamiyinchi Naaku Andinchenu Ee Rakshanaanandamu Kshayamaina Brathuku Maarchi Akshayathanosagenu ||Gathi Leni|| Vaakyame Naa Jeevamai Nannu Brathikinchenu Naa Paadamulaku Chiru Deepamaina Naa Divya Thejamu Aathmaye Paripoornamai Nannu Balaparachenu Naa Adugu Jaadalanu Sthiramu Chesina Naa Jeeva Maargamu Naa Gamyamemito Theliyaka Naa Parugu Aagipogaa Naa Cheyi Patti Nanu Nadipina Naa Maargadarshi Yese Viluvaina Prema Naapai Niluvella Kurisenu ||Gathi Leni||