రక్షింపబడిన నీవు - YouWorship
Rakshimpabadina Neevu
Artist: క్రాంతి చేపూరి
Category: Correction
Song Lyrics
రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు గురి నిలిపి పయనిస్తున్నావా రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు అన్నట్టు జీవిస్తున్నావా (2) యేసే లేని నీ బ్రతుకులో వెలుగే లేదని తెలుసుకో యేసే లేని జీవితానికి విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన|| మంటితోనే నిను చేసినా కంటి పాపగా కాపాడెనే మాటి మాటికి పడిపోయినా శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2) ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా యేసే లేనిదే – పరలోకానికి ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే|| యేసులోనే నీ రక్షణ యేసులోనే నిరీక్షణ యేసులోనే క్షమాపణ చేసుకో మరి ప్రక్షాళన (2) ఎంతో ప్రేమను – నీపై చూపించెను తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా ||యేసే|| Rakshimpabadina Neevu – Lokaashalapaine Needu Guri Nilipi Payanisthunnaavaa Rakshakuni Erigina Neevu – Thaanevaro Theliyadu Naaku Annattu Jeevisthunnaavaa (2) Yese Leni Nee Brathukulo Veluge Ledani Thelusuko Yese Leni Jeevithaaniki Viluve Ledani Thelusuko (2) ||Rakshimpabadina|| Mantithone Ninu Chesinaa Kanti Paapaga Kaapaadene Maati Maatiki Padipoyinaa Shaashwatha Prematho Preminchene (2) Aa Premanu Kaadani – Avasarame Ledani Ee Lokam Naadani – Prabhu Maargam Vidachithivaa Yese Lenide – Paralokaaniki Pravesham Ledane – Paramaardham Marachithivaa ||Yese|| Yesulone Nee Rakshana Yesulone Nireekshana Yesulone Kshamaapana Chesuko Mari Prakshaalana (2) Entho Premanu – Neepai Choopinchenu Thana Praanamu Sahithamu – Neekai Arpinchenugaa Ippatikainanu – Maarchuko Manassunu Prabhuvunu Cheragaa – Vegirame Parugidiraa ||Yese||