రక్షణ నొసగెడు యేసుని ప్రేమను - YouWorship
Rakshana Nosagedu Yesuni Premanu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: రక్షణ నొసగెడు యేసుని ప్రేమను - లక్ష్యము చేయుము ఓ ప్రియుడా (2) అక్షయ రాజ్యము నీయను వచ్చిన -రక్షకున్ బొగడుము స్నేహితుడా (2) 1. లోకపు ప్రేమను యేమని తెల్పెద -నీ కవమానంబే దలచినచో (2) ఆకలిచెందని రక్షకున్ ప్రేమ - తాకుడు నొందుము ఓ ప్రియుడా (2) 2. పాపపు ప్రేమలో విడువక నిలచిన - తాపము చెందెద వో నరుడా పాపిని గావను ప్రేమ స్వరూపుడు - శాపము నోర్చెను కల్వరిలో 3. చచ్చిన పాపిని వెదకి రక్షింప - చచ్చి బ్రతికిన ఘనుడెవడు వచ్చిన పాపిని వద్దని త్రోయని -నిశ్చల ప్రేమామయుడు యేసే 4. నమ్ముము సోదరా నిన్ను రక్షించును - నెమ్మది నొందెదవు నిజము నమ్మినచో ప్రభుప్రేమను గానవు - నమ్ముము ప్రభు ప్రేమ నీదినమే 5. ఘన ధనికుల మత సౌందర్యంబులన్ - గానవు నిజ ప్రేమాదరణల్ ఎన్నిల నున్నను నిలచునే నిత్యము - పెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్ 6. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్ - దండిగ నెరవేర్చుచు ఘనులు ఎందరో వేగిరి పొందను మకుటము పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయ Pallavi: Rakshana Nosagedu Yesuni Premanu - Lakshyamu Cheyumu O Priyudaa (2) Akshaya Raajyamu Neeyanu Vachchina -Rakshakun Bogadumu Snehithudaa (2) 1. Lokapu Premanu Yemani Thelpeda -Nee Kavamaanambe Dalachinacho (2) Aakalichendani Rakshakun Prema - Thaakudu Nondumu O Priyudaa (2) 2. Paapapu Premalo Viduvaka Nilachina - Thaapamu Chendeda Vo Narudaa Paapini Gaavanu Prema Svaroopudu - Shaapamu Norchenu Kalvarilo 3. Chachchina Paapini Vedaki Rakshimpa - Chachchi Brathikina Ghanudevadu Vachchina Paapini Vaddani Throyani -Nishchala Premaamayudu Yese 4. Nammumu Sodaraa Ninnu Rakshinchunu - Nemmadi Nondedavu Nijamu Namminacho Prabhupremanu Gaanavu - Nammumu Prabhu Prema Neediname 5. Ghana Dhanikula Matha Saundaryambulan - Gaanavu Nija Premaadaranal Ennila Nunnanu Nilachune Nithyamu - Pennuga Bondumu Prabhu Preman 6. Thandri Kumaara Shuddhaathmala Chiththamun - Dandiga Neraverchuchu Ghanulu Endaro Vegiri Pondanu Makutamu Pondumu Prabhu Prema Hallelooya