రక్షణ్య పాటలుపాడి రక్షకు డేసును సదా కొనియాడు - YouWorship
Rakshanya Paatalupaadi Rakshaku Desunu Sadaa Koniyaadu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: రక్షణ్య పాటలు పాడి - రక్షకు డేసును సదా కొనియాడు (2) అను పల్లవి: ఇక్కట్టులోన యేసును వెదకి (2) - ఎక్కాల మందును స్తుతించ కూడి (2) 1. అంధకారము నుండి విడిపించి - అమర్త్యుడేసుని రాజ్యము జేరి (2) అన్నియు నొసగు దేవుని జేరి (2) - పెన్నుగ ప్రభును మహిమపరచి (2) 2. అగ్ని నుండితీసి కొరవిని - విఘ్నము లేక బైట వేసి కపట వేషము పారద్రోలిన - ప్రాపకు డేసగు వేకువ చుక్కను 3. భయంకర పాపకూపము నుండి - బురదలో నుండి పైకిలాగి కాళ్ళను బండమీద నిలిపి - పాదములను స్థిరపరచిన యట్టి 4. మరణము నుండి తప్పించినట్టియు - తత్కాలమున తప్పించుచున్న ఇక ముందును తప్పించునను - గొప్ప నమ్మకమును మనకిచ్చిన 5. సంకటములనుండి విడిపించి - వణకును మన కెడబాటు చేసిన కష్టపెట్టిన బాధల తొలగించి - విడిపించినట్టి యేసును చూచి 6. శ్రమల నెల్లను పారద్రోలి - శోధనలు మనలను జేరకను సుఖముల మా కెల్లప్పుడు నిచ్చిన - ప్రేమ స్వరూపిని స్తోత్రించుచును 7. దుష్టలోకము నుండి మనలను - లోకాధిపతి సైతాను నుండి పిసాచి యధికారములో నుండి - విడిపించిన ప్రభునకు హల్లెలూయ Pallavi: Rakshanya Paatalu Paadi - Rakshaku Desunu Sadaa Koniyaadu (2) Anu Pallavi: Ikkattulona Yesunu Vedaki (2) - Ekkaala Mandunu Sthuthincha Koodi (2) 1. Andhakaaramu Nundi Vidipinchi - Amarthyudesuni Raajyamu Jeri (2) Anniyu Nosagu Devuni Jeri (2) - Pennuga Prabhunu Mahimaparachi (2) 2. Agni Nunditheesi Koravini - Vighnamu Leka Baita Vesi Kapata Veshamu Paaradrolina - Praapaku Desagu Vekuva Chukkanu 3. Bhayangkara Paapakoopamu Nundi - Buradalo Nundi Paikilaagi Kaallanu Bandameeda Nilipi - Paadamulanu Sthiraparachina Yatti 4. Maranamu Nundi Thappinchinattiyu - Thathkaalamuna Thappinchuchunna Ika Mundunu Thappinchunanu - Goppa Nammakamunu Manakichchina 5. Sangkatamulanundi Vidipinchi - Vanakunu Mana Kedabaatu Chesina Kashtapettina Baadhala Tholaginchi - Vidipinchinatti Yesunu Choochi 6. Shramala Nellanu Paaradroli - Shodhanalu Manalanu Jerakanu Sukhamula Maa Kellappudu Nichchina - Prema Svaroopini Sthothrinchuchunu 7. Dushtalokamu Nundi Manalanu - Lokaadhipathi Saithaanu Nundi Pisaachi Yadhikaaramulo Nundi - Vidipinchina Prabhunaku Hallelooya