రక్షకుండుదయించినాడట - YouWorship
Rakshakundudayinchinaadata
Artist: మోచర్ల రాఘవయ్య
Category: Christmas
Song Lyrics
రక్షకుండుదయించినాడట మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన ని రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) దేవుడగు యెహోవా మన దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| గగనము నుండి డిగ్గి ఘనుడు గాబ్రియేలు దూత (2) తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోష వార్త ||రక్షకుండు|| వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాడు (2) కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు|| పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముల జుట్టి (2) శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు|| అనుచు గొల్ల లొకరి కొకరు ఆనవాలు జెప్పుకొనుచు (2) అనుమతించి కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు ||రక్షకుండు|| Rakshakundudayinchinaadata Mana Koraku Parama Rakshakundudayinchinaadata Rakshakundudayinchinaadu Raare Golla Boyalaara Thakshanamuna Boyi Mana Ni Reekshana Phala Mondedamu ||Rakshakundu|| Daaveedu Vamshamandu Dhanyudu Janminchinaadu (2) Devudagu Yehovaa Mana Dikku Deri Choochinaadu ||Rakshakundu|| Gaganamu Nundi Diggi Ghanudu Gaabriyelu Dootha (2) Thaginattu Cheppe Vaariki Migula Santhosha Vaartha ||Rakshakundu|| Varthamaanamu Jeppi Dootha Vaibhavamuna Povuchunnaadu (2) Karthanu Joochina Venuka Kaanthumu Vishramam Bappudu ||Rakshakundu|| Pashuvula Thottilona Bhaasillu Vasthramula Jutti (2) Shishuvunu Ganugondurani Sheeghramuganu Dootha Thelpe ||Rakshakundu|| Anuchu Golla Lokari Kokaru Aanavaalu Jeppukonuchu (2) Anumathinchi Kadaku Kreesthu Nandarikinee Delpinaaru ||Rakshakundu||