రండి సువార్త సునాదముతో - YouWorship
Randi Suvaartha Sunaadamutho
Artist: వి. మాసిలామణి
Category: Gospel
Song Lyrics
రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2) ||రండి|| యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతీత పావన నామం భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి|| యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్ధన సహకారం ||రండి|| యేసే సంఘములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి ||రండి|| యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి|| Randi Suvaartha Sunaadamutho Ranjilu Siluva Ninaadamutho Thambura Sithaara Naadamutho Prabhu Yesu Dayaanidhi Sannidhiki (2) ||Randi|| Yese Maanava Jaathi Vikaasam Yese Maanava Neethi Vilaapam Yese Patheetha Paavana Naamam Bhaasura Kraisthava Shubha Naamam ||Randi|| Yese Devuni Prema Swaroopam Yese Sarveshvara Prathiroopam Yese Prajaapathi Paramesham Aashritha Janamula Sukhavaasam ||Randi|| Yese Siluvanu Mosina Daivam Yese Aathmala Shaashwatha Jeevam Yese Kshamaapana Adhikaaram Daasula Praardhana Sahakaaram ||Randi|| Yese Sanghamulo Mana Kaanthi Yese Hrudayamulo Ghana Shaanthi Yese Kutumba Jeevana Jyothi Pasipaapala Deevena Moorthy ||Randi|| Yese Jeevana Mukthiki Maargam Yese Bhakthula Boothala Swargam Yese Prapancha Shaanthiki Soothram Vaasiga Nammina Jana Sthothram ||Randi||