రండి రండి రయమున యేసుని - YouWorship
Randi Randi Rayamuna Yesuni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: రండి రండి రయమున యేసుని - రక్షకునిగ నంగీకరించుడి (2) అను పల్లవి: ప్రీతితో - ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే - రాజుల రాజువే - రాబోవు నాతడే (2) 1. ప్రయాసపడి భారము మోయువారల (2)- అతి ప్రేమతో నాహ్వానించెను (2) భారమంత పార ద్రోలును, విశ్రాంతినిచ్చును - వేగమే రారమ్ము ఈ మాట నిక్కము (2) 2. పాపపు జీతము నిత్యనరకము - ఓ పాపి నీకిక దిక్కెవరు నిత్యజీవ మియ్యవచ్చెను, నీ కొరకువచ్చెను - తన ప్రాణమిచ్చెను, నిన్నురక్షింపను 3. మాయలోకం మోసముజేసెను - మరణసమయము సమీపించెను తన్నుచేరువారి నెవ్వరిన్, తృణీకరించడు నిను త్రోసివేయడు ఈ మాట నమ్ముము 4. క్రీస్తుయేసు నిను ప్రేమించి - నీ కొరకై తానే వచ్చెన్ నీదు దోషమంతటికై, రక్తము కార్చెను - శిక్షను పొందెను, శ్రీ యేసున్ చేరుము 5. పాపులారా పరుగిడిరండి - పాపుల మిత్రుడేసుని చేరుడి శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును - సందేహపడకు, సువార్తన్ నమ్ముము 6. నీదు పాపము నంతటిని - నీవు నిక్కముగ నొప్పుకొనిన ఆయనే తనరక్తముతో, కడుగు ప్రేమతో - కాపాడు నేర్పుతో, కరుణ శక్తితో Pallavi: Randi Randi Rayamuna Yesuni - Rakshakuniga Nanggeekarinchudi (2) Anu Pallavi: Preethitho - Prabhuni Cherudi Prabhula Prabhuve - Raajula Raajuve - Raabovu Naathade (2) 1. Prayaasapadi Bhaaramu Moyuvaarala (2)- Athi Prematho Naahvaaninchenu (2) Bhaaramantha Paara Drolunu, Vishraanthinichchunu - Vegame Raarammu Ee Maata Nikkamu (2) 2. Paapapu Jeethamu Nithyanarakamu - O Paapi Neekika Dikkevaru Nithyajeeva Miyyavachchenu, Nee Korakuvachchenu - Thana Praanamichchenu, Ninnurakshimpanu 3. Maayalokan Mosamujesenu - Maranasamayamu Sameepinchenu Thannucheruvaari Nevvarin, Thruneekarinchadu Ninu Throsiveyadu Ee Maata Nammumu 4. KreesthuYesu Ninu Preminchi - Nee Korakai Thaane Vachchen Needu Doshamanthatikai, Rakthamu Kaarchenu - Shikshanu Pondenu, Shree Yesun Cherumu 5. Paapulaaraa Parugidirandi - Paapula Mithrudesuni Cherudi Shakthitho Ninnu Rakshinchunu Santhoshamichchunu - Sandehapadaku, Suvaarthan Nammumu 6. Needu Paapamu Nanthatini - Neevu Nikkamuga Noppukonina Aayane Thanarakthamutho, Kadugu Prematho - Kaapaadu Nerputho, Karuna Shakthitho