రండి మానవులారా - YouWorship
Randi Maanavulaaraa
Artist: జి జాన్ తాతయ్య
Category: Praise & Worship
Song Lyrics
రండి మానవులారా - రక్షకునిన - మృండి వేగము ప్రియులారా = రండి పాపుల బ్రోచుటకు పర - మండలంబును విడిచి యీ భువి -మండలంబున కరుగుదెంచిన- మహాత్మున్ గనుగొని సుఖింపను ॥రండి॥ 1. ఇలలో మానవులందరు - పలువిధ పాపా - శలలో మునిగి యుండిరి = తులువయగు సాతాను చెడ్డ - వలను జిక్కినవారలన్ దన - బలముతో విడి పింప బ్రాణము - బలిగబెట్టిన ప్రభుని యొద్దకు ॥రండి॥ 2. పరముండు నరులందరికై - మరణంబయ్యె - కరుణతోడను కొరతపై = మరలి మూడవదినమునందున - మహిమతో నా ప్రభువులేచి - తెరవజేసెను మోక్షమార్గము - శరణు జొచ్చినవారలకును ॥రండి॥ 3. పాపభారంబు నుండి - విడుదలనొంద - ప్రాపుగోరినవారలు = ప్రాప కుండగు క్రీస్తునాధుని - దాపుజేరి తపంబు జేసిన - పాపభారము దీసి శాంతిని గూర్చు - యా ప్రభు నొద్దకిపుడే ॥రండి॥ 4. భావమందున దెలియుడి - మరలు నిత్య - జీవమార్గము గనుడీ = పావ నుండగు క్రీస్తు మిమ్మును - పావనులుగా జేసి నూతన - జీవము నొసంగి పర మున - జేర్చు మిమ్మును నిశ్చయముగా ॥రండి॥ Randi Maanavulaaraa - Rakshakunina - Mrundi Vegamu Priyulaaraa = Randi Paapula Brochutaku Para - Mandalambunu Vidichi Yee Bhuvi -Mandalambuna Karugudenchina- Mahaathmun Ganugoni Sukhimpanu ॥Randi॥ 1. Ilalo Maanavulandaru - Paluvidha Paapaa - Shalalo Munigi Yundiri = Thuluvayagu Saathaanu Chedda - Valanu Jikkinavaaralan Dana - Balamutho Vidi Pimpa Braanamu - Baligabettina Prabhuni Yoddaku ॥Randi॥ 2. Paramundu Narulandarikai - Maranambayye - Karunathodanu Korathapai = Marali Moodavadinamunanduna - Mahimatho Naa Prabhuvulechi - Theravajesenu Mokshamaargamu - Sharanu Jochchinavaaralakunu ॥Randi॥ 3. Paapabhaarambu Nundi - Vidudalanonda - Praapugorinavaaralu = Praapa Kundagu Kreesthunaadhuni - Daapujeri Thapambu Jesina - Paapabhaaramu Deesi Shaanthini Goorchu - Yaa Prabhu Noddakipude ॥Randi॥ 4. Bhaavamanduna Deliyudi - Maralu Nithya - Jeevamaargamu Ganudee = Paava Nundagu Kreesthu Mimmunu - Paavanulugaa Jesi Noothana - Jeevamu Nosanggi Para Muna - Jerchu Mimmunu Nishchayamugaa ॥Randi॥